Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
ఇన్ స్టాంట్ ఎగ్ నూడిల్స్ : ఫాదర్స్ డే స్పెషల్
రేపు ఫాదర్స్ డే సందర్భంగా వారికోసం ఏం తయారుచేయాలని ఆలోచిస్తున్నారు. ఇన్ స్టాంట్ గా ఏదైనా త్వరగా తయారుచేయాలనుకుంటే ఎగ్ నూడిల్స్ చాలా సులభం. అంతే కాదు, వీటి ధర కూడా చాలా తక్కువ, అలాగే చాలా త్వరగా తయారుచేయవచ్చు. ఎప్పుడు మీరు బ్యాచులర్ గా హాస్టల్లో ఉన్నప్పుడు తయారుచేసుకొన్న ఇన్ స్టాంట్ ఎగ్ నూడిల్స్ మీచేతులతో మీ ఫాదర్ కు చేసి పెడితే వారు కూడా ఇష్టపడవచ్చు .
కాబట్టి, ధర తక్కువ, రుచి ఎక్కువగా ఉన్న ఇన్ స్టాంట్ ఎగ్ నూడిల్స్ ను మీరు మీ ఫాదర్ కోసం ఇష్టంగా తయారుచేస్తే మరింత రుచిగా ఉంటుంది. ఈ రుచికరమైన ఎగ్ నూడిల్స్ తిన్న మీ ఫాదర్ కు ఆయన కాలేజ్ డేస్ గుర్తుకు రావాల్సిందే...
కావల్సిన పదార్థాలు:
ఇన్ స్టాంట్ నూడల్స్: 2
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగివి)
బెల్ పెప్పర్: ½ cup (సన్నగా తరిగినవి)
టమోటో :½ cup(సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
గుడ్లు -3 (పగులగొట్టి కప్పులో వేసి పెట్టుకోవాలి)
ఆయిల్: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో రెండు కప్పులు నీళ్ళు పోసి కాగినివ్వాలి.
2. నీరు బాగా మరిగేటప్పుడు, అందులో టేస్ట్ మేకర్ మరియు నూడిల్స్ వేసి బాగా మిక్స్ చేయాలి.
3. నూడిల్స్ ఉడకడం ప్రారంభం అవ్వగానే, మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి.
4. నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో బెల్ పెప్పర్ అండ్ టమోటో ముక్కలు పాన్ లో వేసి ఫ్రై చేయాలి .
6. తర్వాత అందులో ఉడికించుకొన్న నూడిల్స్ వేసి తర్వతా వేగించుకొన్న వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేయాలి.
7. తర్వాత మరో పాన్ వేడి చేసి, నూనె రాసి, గుడ్డు సొన వేసి హాఫ్ బాయిల్ చేసి న్యూడిల్స్ మీద ప్లేస్ చేయాలి. అంతే ఇన్ స్టాంట్ ఎగ్ నూడిల్స్ రెడీ.



Click it and Unblock the Notifications











