For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ పొటాటో కర్రీ : క్రిస్మస్ స్పెషల్

|

క్రిస్మస్ చాలా దగ్గరలో రాబోతోంది. క్రిస్మస్ రోజున వివిధ రకాల నాన్ వెజ్ వంటలు, కేక్స్, వైన్స్ తో ప్రతి ఇంట్లో అథితులు, కుటుంబ సభ్యులతో సందడి సండదిగా ఉంటుంది. అంతక ముందే క్రిస్మస్ రోజును ఏ వంటలు చేయాలి. అందుకు అవసరం అయ్యే వస్తువులేంటే, డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ ఎలా డెకొరేట్ చేయాలని, అప్పుడే పనులు చకచక మొదలెట్టేసి ఉంటారు. అయితే, డిన్నర్ కు తగ్గ నాన్ వజ్ వంటలు ఈ డైనింగ్ టేబుల్ మీద చేరిప్పుడే పూర్తిగా అలంకరణగా కనబడుతుంది.

ఈ క్రిస్మస్ సందర్భంగా మీకోసం ఒక స్పెషల్ న్యూట్రీషియన్, ప్రోటీన్ ఫుడ్స్ ను కొత్త రుచితో మీకు పరిచయం చేస్తున్నాం. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది. మీట్ ఆలూ కర్రీ రిసిపి. తయారుచేయడం చాలా సులభం, అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. చాలా తక్కవ మసాలతోనే నోరూరించే ఈ స్పెషల్ నాన్ వెజిటేరియన్ ను రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

Meet Potato Curry Recipe

కావల్సిన పదార్థాలు:

  • మటన్: 1kg
  • నెయ్యి: 150grms
  • బంగాళదుంపలు: 1/2(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • అల్లం పేస్ట్: 1tbsp
  • వెల్లుల్లి పేస్ట్: 1tbsp
  • పచ్చిమిర్చి: 6 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
  • ఉల్లిపాయలు: 1/2kg (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
  • టమోటోలు: 1/2 Kg(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
  • యాలకలు: 4
  • లవంగాలు: 4
  • పలావు ఆకులు: 3
  • మిరియాలు: 1
  • దాల్చిన చెక్క: 2 ముక్కులు
  • పసుపు: 1/4
  • కారం : రుచికి సరిపడా
  • కొత్తమీర తరుగు : 1/2
  • ఉప్పు: రుచికి సరిపడ
  • నూనె తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపల్ని తొక్క తీసి కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటోలు, కూడా విడివిడిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో మసాలాలన్నీ వేయాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి , పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి.
4. టమోటో, ఉల్లిపాయ మెత్తగా వేగిన తర్వాత అందులో మటన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలుపుతూ వేగించాలి, రెండు నిముషాల తర్వాత కారం కూడా వేసి వేగిస్తూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి .
5. మటన్ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులోనే బంగాళదుంప ముక్కలు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత అరలీటర్ నీళ్ళు పోసి మూత పెట్టి తక్కవ మంట మీద మటన్ మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి.
6. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి నూనె పైకి తేలే వరకూ మటన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
7. నీరు పూర్తిగా ఇమిరిపోకుండా అందులో మల్లీ ఒక గ్లాసు నీల్లు పోసి సిమ్ లో పెట్టి ఉడికించాలి . గ్రేవీ మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వేడి వేడి బిర్యానీ, గీ రైస్, పులావ్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Meet Potato Curry Recipe : Christmas Special

A very very healthy vegetable, with lots of nutrients cooked with mutton and potato. Makes Simply the tasty meal, made from mutton, potato and other main ingredients. This is a famous an authentic recipe.
Story first published: Friday, December 18, 2015, 17:35 [IST]
Desktop Bottom Promotion