Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి -
పారేసే తొక్కలతో అదిరిపోయే రుచి.. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి!
మటన్ కర్రీ-రాజ్ పుత్ స్పెషల్

అక్కడి మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన రాజ్ పుత్ మటన్ కర్రీని లాల్ మాస్ అని కూడా అంటారు. ఈ రుచికరమైన రాజ్ పుత్ మటన్ కర్రీనీ మీరూ టేస్ట్ చూడాలనుకుంటే, ఇంట్లోనే స్పెషల్ గా తయారు చేసుకొనే చక్కటి విధానం ఇక్కడ ఉంది. ఈ రాజ్ పుత్ స్పెషల్ కర్రీ అన్నం, చపాతీలు, దోసెల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి.
కావలసిన పదార్థాలు:
పొట్టేలు మాంసం: 1/2kg
ఉల్లిపాయలు : 1/4kg
అల్లంవెల్లుల్లి : 2tbsp
కారం : 1tsp
ధనియాలపొడి : 2tsp
లవంగాలు : 5
యాలకులు: 5
దాల్చినచెక్క ముక్కలు: 3
పులావు ఆకులు: 5
పెరుగు: 1cup
టొమోటో గుజ్జు: 1cup
గరం మసాలా : 2tsp
నూనె: 1/2cup
ఉప్పు : సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగనివ్వాలి. తరువాత మంట తగ్గించి మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి.
2. ఇప్పుడు మటన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మూతపెట్టి అరగంట సేపు మగ్గనివ్వాలి.
3. తరువాత మూత తీసి ఓసారి కలియదిప్పి కారం, ధనియాలపొడి, పెరుగు వేసి తక్కువ మంటమీద ముక్కలు మెత్తగా అయ్యేంతదాకా ఉడికించాలి.
4. మటన్ మెత్తబడ్డాక టొమోటో గుజ్జు వేసి గరంమసాలా కూడా వేసి కలియబెట్టి, మూతపెట్టి మరో ఐదు నిమిషాలు తక్కువ మంటలో ఉడికించాలి. అంతే రాజ్ పుత్ స్పెషల్ కర్రీ రెడీ..! ఇది అన్నం, చపాతీలు, దోసెల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి.



Click it and Unblock the Notifications











