Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
ఘుమఘుమలాడే మటన్ పులావ్ రిసిపి
మటన్ పులావ్ ఒక డిఫరెంట్ నాన్ వెజిటేరియన్ రిసిపి. ఈ మటన్ రిసిపి కాంబినేషన్ బాస్మతి రైస్ మరియు మాంసంతో తయారుచేస్తారు. అయితే ఇది బిర్యానీ మాత్రం కాదు. బిర్యానీ రిసిపిలకు, పులావ్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. మటన్ పులావ్ లో పదార్థాలు చూడటానికి సిమిలర్ గా ఉండవచ్చు కానీ బిర్యానీ, పులావ్ కు వంట వండే విధానంలో చాలా వ్యత్యాసం ఉంటుంది.
పులావ్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు మంచి రుచి, ఫ్లేవర్ తో తయారవుతుంది. మాంసాహార ప్రియులు మటన్ పులావ్ ను టేస్ట్ చేయాలంటే ఈక్రింది పద్దతిని ఫాలో అవ్వండి...

మటన్ : 500grm
బాస్మతి రైస్: 1kg
కొబ్బరికాయ: 1
నెయ్యి: 4tsp
జీడిపప్పు: 10
ఉల్లిపాయలు: 4
అల్లం : 20grm
వెల్లుల్లి : 20grm
దాల్చిన చెక్క: కొద్దిగా
ధనియాలు : 20grm
గసగసాలు : 2tsp
పుదీన : ఒక కట్ట
కొత్తిమీర : ఒక కట్ట
పచ్చిమిరపకాయలు: 8-10
నూనె : తగినంత
ఉప్పు : రుచికి సరిపడా
బిర్యాని ఆకులు : రెండు
పెరుగు : 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట ముందు నాన పెట్టుకోవాలి.
2. గసగసాలు నూనె లేకుండా వేపి ప్రక్కన పెట్టుకోవాలి.
3. ధనియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెళ్ళుళ్ళి గ్రైండ్ చేసుకోవాలి.
4. గసగసాలు, పచ్చికొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి
5. ఉల్లిపాయలను తరిగి ప్రక్కన పెట్టుకోవాలి.
6. పూదీన, కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి.
7. మటన్ సుభ్రంగా కడిగి అందులో పుసుపు, ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి.
8. ఒక పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి అందులో నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెళ్ళుళ్ళి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇవి వేగుతుండగా జీడిపప్పు, పుదీన, కొత్తిమీర, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికొబ్బరి, గసగసాల పేస్ట్, బిర్యాని ఆకు, పెరుగు వేసి కొంచెం నూనె వేసి బాగ వేగనివ్వాలి.
9. తరవాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేగుతున్నమసాలలో వేసి కలిపి, నాన పెట్టుకున్న బాస్మతి బియ్యాని కూడ వేసి నాలుగు గ్లాసుల నీళ్ళు లేదా కొబ్బరి పాలు వేసుకుని నాలుగు వైపుల కలిపి ఉప్పు, కారం రుచి చూసి, కావలనిపిస్తే మరి కొంచెము వేసుకుని, చిన్న మంట మీద పెట్టి వుడకనివ్వాలి.
10. పదిహేను నిమషాలు తరవాత దించుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే మటన్ పులావ్ రెడీ! ఈ పులావ్ని సాలాడ్తో తింటే చాల రుచిగా వుంటుంది.



Click it and Unblock the Notifications











