Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
ప్రాన్ విందాలు: వీకెండ్ స్పెషల్ సీఫుడ్ స్పెషల్
మీకు స్పైసీ సీఫుడ్ అంటే ఇష్టమైతే, ఈ వంట మీకు తప్పకుండా నచ్చుతుంది. విందాలు భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఒక ప్రసిద్ధ వంటకం ఉంది మరియు ఈ వంట పోర్చుగీస్ వారి మూలాలుగా ఉన్నాయి. ఈ వంటన్ యొక్క చాలా ప్రసిద్ద వెర్షన్ చికెన్ లేదా పోర్క్ తో తయారుచేస్తారు. అయితే ఇక్కడ మనం అదే మసాలాతో ప్రాన్ విందాలు వంటను తయారుచేస్తున్నాం .
ఈ ప్రాన్ విందాల, సీఫుడ్ నాన్ వెజిటేరియన్ వారికి చాలా ఇష్టమైన వంట. ఈ వంటకు ఉపయోగించే కొబ్బరి పాలు, ఒక మంచి ఫ్లేవర్ తో పాటు, నోరూరించే రుచిని కూడా అంధిస్తుంది. ఇది ఒక మంచి ఫ్లేవర్ ను మరియు రుచిని బ్యాలెన్స్ చేస్తుంది. మరి ఈ ఫ్లేవర్ ఫుల్ మరియు కలర్ ఫుల్ ప్రాన్ విందాలను ఎలా తయారుచేయాలో ఈ వీకెండ్ స్పెషల్లో తెలుసుకుందామా...

ప్రాన్స్: 500 gms
వైట్ వెనిగర్: 3tbsp
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటో: 3 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం-1చిన్నముక్క (తురిమినది)
వెల్లుల్లి రెబ్బలు: 4 (చిన్న ముక్కలుగా తరిగి)
జీలకర్ర: ½tsp
ఎండు మిర్చి : 3
కొబ్బరి పాలు :½ cup
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
కొత్తిమీర: 2tsp(గార్నిష్ కోసం సన్నగా తరిగినది)
తయారుచేయు విధానం:
1. ముందగా ప్రాన్స్ కు ఉన్న పై షెల్ ను తొలగించి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వెనిగర్ లో జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి 15నిముషాలు నానబెట్టుకోవాలి. 15నిముషాల తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, 5నిముషాలు వేయించుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు మొత్తగా వేగిన తరవ్ాత అందులో గ్రైండ్ చేసుకొన్న మసాలా ముద్దను అందులో వేసి మరో 3 నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
5. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న టమోటో ముక్కలను వేసి మరో 5నిముషాలు వేయించుకోవాలి.
6. టమోటోలో మెత్తగా వేగిన తర్వాత అందులో ప్రాన్స్ మరియు ఉప్పు వేసి, రెండు నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత అందులో కొబ్బరి పాలు పోసి 10నిముషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
8. అంతే, ప్రాన్స్ మెత్తగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











