రెడ్ చిల్లి చికెన్

Red Chilli Chicken
కోడి మాంసం: 500gms
పండుమిర్చి: 6
ఉల్లిపాయలు: 2 gm
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tsp
లవంగాలు: 4
జీలకర్ర: 1/4 tsp
గరం మసాల: 1/2 tsp
చింతపండు గుజ్జు: 2 tbsp
ఉప్పు: రుచికి పరిపడా
నూనె : తగినంత

తయారు చేయు విధానము:
1. పండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయల్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత వెడల్పాటి పాన్ లో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలను దోరగా వేయించాలి.
3. అ తర్వాత ఈ మసాలా ముద్దను కూడా వేసి కొద్దిగా వేపి కోడిమాంసం ముక్కల్ని వేసి పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి సన్నటి మంటపై ఉడికించాలి.
4. ఇప్పడు చికెన్ ఉడకగానే కొద్దిగా చింతపండు గుజ్జు కొత్తిమిర వేసి కొద్దిసేపు ఉడికించి నూనె తేలగానే గరం మసాలా వేసి కలిపి దింపేయాలి. అంతే మిరప కోడికూర రెడీ. ఇది అన్నంతో గాని, చపాతితో గాని భలే రుచిగా ఉంటుంది.

Story first published: Saturday, November 27, 2010, 14:10 [IST]
Desktop Bottom Promotion