Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
నోరూరించే మంగోలియన్ చికెన్ రిసిపి
మీరు ఇంట్లో చైనీస్ ఫుడ్ తయారుచేసుకోవాలనుకుంటున్నారా? మరి అయితే ఈ స్వీట్ అండ్ స్పైసీ చికెన్ మంగోలియన్ చికెన్ రిసిపిని ట్రై చేయండి. మంగోలియన్ చికెన్ రిసిపి ఫర్ ఫెక్ట్ ఏషియన్ డిష్. ఇది కొద్దిగా తీయ్యగా, పుల్లగా మరియు స్పైసీగా ఉంటుంది. ఈ రిసిపిని ఒరిజినల్ గా బీఫ్ తో తయారుచేస్తారు. అయితే ఇక్కడ చికెన్ లవర్స్ కోసం కొంచెం వెరైటీ టేస్ట్ అంధివ్వడానికి ఇలా తయారుచేయబడింది.
మంగోలియన్ చికెన్ రిసిపి తయారుచేయడానికి, అంత ఎక్కువ పదార్థాలు అవసరం లేదా. ఎందుకంటే ఈ చికెన్ రిసిపి మొత్తం సాస్ లతోనే ముడిపడి ఉంది. ఇంట్లో ఈ క్రింది లిస్ట్ లోని సాస్ లు ఉంటే, మంగోలియన్ చికెన్ రెడీ అయినట్లే. ఇంట్లో లేకపోయినా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ స్పెషల్ మంగోలియన్ చికెన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grm(బోన్ లెస్ చికెన్)
కార్న్ స్ట్రాచ్: ½cup(కోటింగ్ పూత కోసం)
వెల్లుల్లి: 1tbsp (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
స్ప్రింగ్ ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
నల్ల మిరియాలు పొడి: 1tsp
Hoisin సాస్: 2tbsp
సోయా సాస్: 2tbsp
ఒయిస్ట్రెస్ సాస్: 1tbsp
రెడ్ చిల్లీ ప్లేక్స్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
చక్కెర: 1tsp
నూనె: 1tbsp (స్టైర్ ఫ్రై చేయడానికి)
నూనె: 2cups(డీప్ ఫ్రై చేయడానికి)
నీళ్ళు: 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కార్న్ స్ట్రాచ్ ను ఒక ప్లేట్ లో స్ప్రెడ్ చేయాలి. చికెన్ ముక్కలను బాగా ఇటు, అటు పొర్లించడం వల్ల బాగా చికెన్ ముక్కలకు స్టార్చ్ బాగా పడుతుంది.
3. తర్వాత డీప్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగనివ్వాలి, మీడియం మంట పెట్టి నూనె కాగిన తర్వాత అందులో చికెన్ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
4. ఒక్కసారి చేసిన తర్వాత చికెన్ ను పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సోయా సాస్, ఓయిస్ట్రెస్, hoisin sauce, రెడ్ చిల్లీ ప్లేక్స్ మరియు షుగర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. తర్వాత పాన్ లో నూనె వేసి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడయం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే కట్ చేసుకొన్ని వెల్లుల్లి మరియు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి 2-3నిముషాలు వేగించుకోవాలి.
8. తర్వాత అందులోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి కలపాల. ఇప్పుడు అందులోనే మిక్స్ చేసి పెట్టుకొన్న సాస్ మిశ్రమాన్ని కూడా వేసి మిక్స్ చేసి 5నిముషాలు ఉడికించుకోవాలి.
9. సాస్ చిక్కగా మారుతుండగా అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి రెండు నిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, సర్వ్ చేయాలి. అంతే స్టైర్ ఫ్రై మంగోలియన్ చికెన్ రెడీ. ఇది వేడి వేడి అన్నం లేదా నూడిల్స్ కు ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ .



Click it and Unblock the Notifications











