Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
జస్ట్ 10 నిమిషాల్లో ఘుమఘుమలాడే పచ్చిమిర్చి నిల్వ పచ్చడి..భోజనానికి కొత్త రుచి
నిల్వ పచ్చడి అనగానే సాధారణంగా మనకు గుర్తుకొచ్చేది టమాటో,ఎండుమిరపకాయల పచ్చడి,అల్లం పచ్చడి, మామిడికాయ పచ్చడి, వెల్లుల్లి పచ్చడినే. అయితే మీరెప్పుడైనా పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడిని ట్రై చేశారా? టేస్ట్ కేక ఉంటుంది. పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడిని నార్త్ ఇండియాలో ఎక్కువగా తయారుచేస్తుంటారు. దీనిని తయారుచేయడం చాలా ఈజీ. జస్ట్ 10 నిమిషాల్లో ఈ నిల్వ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు.
వేడి వేడి అన్నంలో పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడి కలుపుకొని తింటుంటే ఆహా అని తీరాల్సిందే. చపాతీ,రోటీ వంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా కూడా ఇది సూపర్ గా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా నార్త్ ఇండియా స్పెషల్ అయిన పచ్చిమిర్చి నిల్వ పచ్చడిని తయారుచేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చిమిరపకాయలు
-ధనియాలు
-సోంపు
-మెంతులు
-జీలకర్ర
-నిమ్మరసం
-ఉప్పు
-కశ్మీరీ కారం
-పసుపు
-ఆవ నూనె
-ఇంగువ
-కలోంజి గింజలు
-వెనిగర్
తయారీ విధానం
-ముందుగా 250 గ్రాముల ప్రెష్ సన్నని పచ్చి మిరపకాయలను తీసుకొని మిరపకాయల తొడిమలను తొలగించండి.
-తర్వాత తొడిమలు తీసిన మిరపకాయలను అన్నింటిని ఓ బౌల్ లో వేసి ఓ గ్లాసు సాయంతో వాటిని కట్ చేసుకోండి. గ్లాసు వెనుక భాగాన్ని చేత్తో పట్టుకొని మిరపకాయలను అటు ఇటూ గ్లాసుతో నలుపుతున్నట్లు చేస్తే కట్ అయిపోతాయి.
-తర్వాత 5 నిమ్మకాయల రసం పిండి దానిని కచ్చాపచ్చాగా కట్ చేసిన మిరపకాయ ముక్కల్లో వేయండి. ఇందులోనే రుచికి సరిపడే దానికంటే కొంచెం ఎక్కువ ఉప్పు కూడా వేసుకొని స్పూన్ తో మొత్తం కలిసేలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల సోంపు గింజలు, అర టీస్పూన్ మెంతులు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి సన్నని సెగ మీద మసాలాలన్నీ మంచి సువాసన వచ్చేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి మసాలాలను చల్లారనివ్వాలి.
-చల్లారిన వేయించిన మసాలాలను రోట్లో లేదా మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు మిరపకాయ ముక్కలు ఉన్న బౌల్ లోనే గ్రైండ్ చేసిన మసాలాల మిశ్రమాన్ని వేయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కశ్మీరీ కారం పొడి, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కలోంజి గింజలు(నల్ల జీలకర్ర), ఒకటిన్నర టీస్పూన్ ఇంగువ వేసి స్పూన్ తో మెత్తం కలిసేలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నిల్వ పచ్చడి పెట్టుకోడానికి సరిపడా ఆవనూనె(ఆవాల నూనె)వేసి వేడి చేశాక స్టవ్ ఆపేసి ఆయిల్ ని చల్లారనివ్వాలి.
-ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపి పెట్టుకున్న మిరపకాయ ముక్కల మిశ్రంలో ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











