సూపర్ ఫుడ్ బ్రోకలీతో క్రిస్పీ దోసె..ఇమ్యూనిటీకి బెస్ట్, రుచిలో ఫస్ట్!

Posted By:

బ్రోకలీ, ఆకుకూరలు వంటి పోషకమైన పదార్థాలను వారి చేత తినిపించడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. మీ పిల్లలు కూడా బ్రోకలీని చూడగానే ముఖం తిప్పుకుంటున్నారా? అయితే బ్రోకలీని నేరుగా ఇస్తే తినని పిల్లలు క్రిస్పీ దోసె రూపంలో ఇస్తే లొట్టలేసుకుంటూ తింటారు.

బ్రోకలీని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. దీనిని దోసె రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాల్షియం, విటమిన్ K సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు రావు. బరువు తగ్గాలనుకునే పెద్దలకు కూడా ఇది అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.

Nutrient Rich Broccoli Dosa Recipe Healthy Twist to Regular Dosa

బ్రోకలీ దోసె తయారీకి కావలసిన పదార్థాలు

బ్రోకలీ ముక్కలు - 1 కప్పు
దోస పిండి లేదా బొంబాయి రవ్వ - 1 కప్పు
పెరుగు - అర కప్పు
పచ్చిమిర్చి - 1
ఉల్లిపాయ - 1
అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - దోసె కాల్చడానికి

తయారీ విధానం

-ముందుగా బ్రోకలీని ఉప్పునీటిలో శుభ్రంగా కడగాలి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా ఆవిరిపై కాసేపు ఉడికించి మెత్తగా చేసుకోవాలి. ఆవిరిపై ఉడికించడం వల్ల బ్రోకలీలోని పోషకాలు పోవు, పిండిలో సులభంగా కలిసిపోతుంది.

-మీరు సాధారణ దోస పిండిని వాడుతుంటే నేరుగా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒకవేళ రవ్వ (సుజీ) వాడుతుంటే అందులో పెరుగు, తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి.

-ఇప్పుడు ఈ పిండిలో ముందుగా సిద్ధం చేసుకున్న బ్రోకలీ (తురుము లేదా పేస్ట్), సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి మరీ చిక్కగా లేదా మరీ పల్చగా కాకుండా దోసెలు వేయడానికి వీలుగా ఉండేలా చూసుకోండి.

-స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక, కొంచెం నూనె రాసి, ఒక గరిటె పిండిని తీసుకుని పల్చగా దోసెలా పరచండి.

-దోసె చుట్టూ కొంచెం నూనె లేదా నెయ్యి వేయండి. మీడియం మంట మీద దోసెను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాల్చాలి. ఇలా చేయడం వల్ల బ్రోకలీ పచ్చి వాసన పోయి, మంచి సువాసన వస్తుంది.

-వేడి వేడి బ్రోకలీ దోసెను కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ లేదా సాంబార్‌ తో వడ్డిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

-పిల్లలకు పెట్టే పని అయితే దోసె వేడి మీద ఉన్నప్పుడే పైన కొంచెం తురిమిన చీజ్ వేసి ఇవ్వండి. చీజ్ కరుగుతూ దోసెకు మరింత రుచిని ఇస్తుంది, పిల్లలు దీన్ని పిజ్జా దోసెలా ఫీలవుతూ ఇష్టంగా తింటారు.

[ of 5 - Users]
Story first published: Tuesday, February 10, 2026, 10:48 [IST]
Desktop Bottom Promotion