Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒక్క రోజులో పెట్టుకునే ఊర మిరపకాయలు..ఇలా చేస్తే ఏడాదైనా నిల్వ ఉంటాయ్
పప్పుచారు,పప్పు అన్నం, సాంబారులో సైడ్ డిష్ గా ఊరమిరపకాయలు సూపర్ గా ఉంటాయి.వీటిని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి. మన తెలుగు సంప్రదాయ వంటకాల్లో ఊరమిరపకాయ కూడా ఒకటి. వీటిని వాము మిరపకాయ,చల్ల మిరపకాయ అని కూడా అంటారు. అయితే చల్ల మిరపకాయలను పెరుగులో నానబెట్టుకుని ఐదు రోజుల పాటు ఊరబెట్టుకుంటారు. ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్. అయితే అసలు పెరుగు,మజ్జిగ లేకుండా కేవలం ఒక్కరోజులోనే చల్ల మిరపకాయలను ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
ఊర మిరపకాయలు తయారీకి కావల్సిన పదార్థాలు
మిరపకాయలు
ఆయిల్
వాము
ఉప్పు
నిమ్మకాయ రసం

ఊర మిరపకాయలు తయారీ విధానం
-ముందుగా 30 గ్రాముల వాముని మిక్సీలో వేసి మెత్తగా పొడి
చేసుకోండి.
-ఇప్పుడు కారం తక్కువ ఉండే లావాటి అరకిలో పచ్చిమిర్చి ఓ ప్లేట్ లోకి
తీసుకోండి.
-వీటిని తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగి జాలు గిన్నెలో వేసి..నీళ్లు
పోయిన తర్వాత ఓ క్లాత్ పై పెట్టి ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి.
-ఇప్పుడు మిరపకాయల తొడిమలు తీసి మధ్యలోకి రెండుగా కట్ చేసి వెడల్పాటి
ప్లేట్ లో వేసుకోండి.
-ఇప్పుడు వాము పొడి,50 గ్రాముల ఉప్పు,1 మీడియంసైజు నిమ్మాకాయ రసం
పిండి మిరపకాయలలో వేసి మిర్చీకి బాగా పట్టేలా కలిపి ఒక గంట పక్కన
పెట్టుకోవాలి.
-గంట తర్వాత ఈ మిర్చిని ఓ గిన్నెలో వేసి గంటతో కొంచెం అదిమి తర్వాత
మూతపెట్టి ఒక రోజుంతా అలాగే ఉండనివ్వండి. ప్రతి 8 గంటలకొకసారి మూత
తీసి మిరపకాలు కలుపుకొని గంటతో నొక్కిపట్టిన తర్వాత మూత
పెట్టేయండి.
-24 గంటల తర్వాత అంటే ఒక రోజు తర్వాత ఓ కాటన్ క్లాత్ ని ఎండలో పరిచి
దాని మీద ఈ మిరపకాయలను పలుచగా స్ప్రెడ్ చేసుకొని అవి కరకరలాడేవరకు
ఎండబెట్టుకోవాలి.
-ఇవి బాగా ఎండటానికి రెండు మూడు రోజులు పడుతుంది.పగలు అంతా ఎండబెట్టి
సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్లీ మరుసటి ోజు ఎండ రాగానే ఎండలో
పెడుతూ అలా ఎండబెట్టుకోవాలి.
-అవి కరకరలాడేంత వరకు ఎండితే చాలు. సంవత్సరం పైనే ఇవి పాడవకుండా నిల్వ
ఉంటాయి.
-వీటిని తినాలనుకున్నప్పుడు నూనెలో ఎర్రగా వేయించుకొని పప్పు
చారు,పప్పులో లేదా మరేదైనా కూరలో కలుపుకోని తింటే అదిరిపోతుంది.
వీటిని వాము మిరపకాయలు అని కూడా అంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications