Latest Updates
-
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి?
తందూరి మసాలా పొడిని ఇలా తయారు చేశారంటే.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఘుమఘుమలు.!
మన సాంప్రదాయ వంటకాల్లో మసాలాలకు ప్రత్యేక స్థానం. సాంబార్ పౌడర్, గరం మసాలా పౌడర్‌తో పాటు తందూరి మసాలా కూడా చాలా ఫేమస్. సాధారణంగా ఈ మసాలా రుచిని ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లలో చూస్తుంటాం. దీని సువాసన, రుచికే నోట్లో నీళ్లు ఊరతాయి. తందూరి మసాలాను జత చేయడం ద్వారా ఆ వంటకానికే కొత్త రుచి వస్తుంది. కానీ బయట దొరికే వాటిలో ప్రిజర్వేటివ్‌లు ఉన్న కారణంగా తరచూ వాడే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇంట్లోనే సింపుల్‌గా తందూరి మసాలా పౌడర్‌ను సింపుల్‌గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

మన వంటగదిలోనే దొరికే తాజా పదార్థాలతో తందూరి మసాలా పౌడర్‌ను చేసుకున్నట్లయితే సువాసన, రుచి ఎక్కువ కాలం తాజాగా, అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక, మీరు ఏ స్పెషల్ రెసిపీ చేసుకోవాలనుకున్నా.. ఈ పొడి మీ వంటకం రుచిని రెట్టింపు చేస్తుంది. మరి దీనిని ఎలా తయారుచేయాలి, ఎలా నిల్వ చేయాలి, ఏయే వంటకాల్లో ఉపయోగించవచ్చు.. ఇక్కడ చూద్దాం..
తందూరి మసాలా పౌడర్ తయారీకి కావలసిన పదార్థాలు
కాశ్మీరీ రెడ్ చిల్లీ- 25 గ్రాములు
ధనియాలు- రెండు టేబుల్ స్పూన్లు
నల్లమిరియాలు- టీస్పూన్
మెంతులు- టీస్పూన్
సోంపు గింజలు- 1 టీస్పూన్
వాము- 1/2 టీస్పూన్
యాలకులు- నాలుగు
దాల్చిన చెక్క- అంగుళం సైజు
లవంగాలు- ఐదు
బిర్యానీ ఆకు- ఒకటి
సొంటి పొడి- టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
వేయించిన ఉల్లిపాయ పొడి- టీస్పూన్
ఆమ్చూర్ పౌడర్- అర టీస్పూన్
కసూరి మెంతి- రెండు టీస్పూన్లు
జాపత్రి- ఒకటి
తందూరి మసాలా పౌడర్ తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ, ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, మెంతులు, సోంపు, వాము, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, కసూరి మెంతి, జాపత్రి బిర్యానీ ఆకును తక్కువ మంట మీద వేయించుకోవాలి.

వేగుతున్నప్పుడు వాటి నుంచి సువాసన వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
ఇందులో సొంటి పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ పొడి, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్‌ను వేసి మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకోవాలి.
అంతే ఎంతో సింపుల్‌గా తందూరి మసాలా పౌడర్ సిద్ధం. ఈ పొడిని చల్లారిన తర్వాత శుభ్రమైన గాలి చొరబడని గాజు డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వాడేటప్పుడు పొడి చెంచాను ఉపయోగించాలి. తడి తగలనివ్వకుండా చూసుకోవాలి.
తందూరి మసాలా పౌడర్‌ను ఇలా వాడండి..
ఈ తందూరి మసాలా పౌడర్‌ను వివిధ రకాల వంటల్లో వాడటం ద్వారా రుచి మరింతగా పెరుగుతుంది. తందూరి పనీర్, పనీర్ టిక్కా, తందూరి చికెన్, చికెన్ టిక్కా, సోయా చాప్, వెజ్ నాన్‌వెజ్ కబాబ్‌లు, రోల్స్, వ్రాప్స్‌లలో ఈ మసాలాను పట్టించినట్లయితే టేస్ట్ ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. ఇంకా తవా పనీర్, మసాలా మష్రూమ్‌లలో కూడా తందూరి మసాలా పౌడర్‌ను ఉపయోగించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
