Latest Updates
-
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా..
ఈ బఠానీ గుడ్డు మసాలా రుచి చూడండి..ఏమి టేస్ట్ రా నాయనా అదిరిపోతుందంతే..ఎలా చేసుకోవాలంటే..
ఇంట్లో రోజూ ఒకే రకమైన గుడ్డు కూర తిని బోర్ కొట్టిందా? ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కాస్త కొత్తగా, నోటికి రుచిగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ బఠానీ ఎగ్ మసాలా అన్నం, చపాతీ, పూరీ, దోశ.. ఇలా ఎందులోకైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఈ వంటకం అచ్చం దాబా స్టైల్ రుచిని ఇస్తుంది. దీని రుచి చూస్తే మీ కుటుంబ సభ్యులు మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు.

బఠానీ ఎగ్ మసాలా కావలసిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు: 6
నూనె: 1 టేబుల్ స్పూన్
పసుపు: పావు టీస్పూన్
కాశ్మీరీ కారం: అర టీస్పూన్
గ్రేవీ మసాలా కోసం
నెయ్యి, నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి తరుగు: 2 టేబుల్ స్పూన్లు
తాజా టమాటా ప్యూరీ: 1 కప్పు
ధనియాల పొడి: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: 1/2 టేబుల్ స్పూన్
కాశ్మీరీ కారం: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి: 1/2 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
శనగపిండి: 1 టేబుల్ స్పూన్
ఉడికించిన పచ్చి బఠానీలు: అర కప్పు
కసూరి మెంతి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా: అర టేబుల్ స్పూన్
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే
మళ్లీ మళ్లీ కావాలంటారు!
తయారీ విధానం
-ముందుగా ఉడికించిన గుడ్లకు తొక్క తీసి, మసాలా లోపలికి వెళ్లేలా చాకుతో చిన్నగా గాట్లు పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో పసుపు, కారం వేసి కలిపాక, ఉడికించిన గుడ్లను వేసి దోరగా వేయించాలి. గుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.
-అదే పాన్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఒక స్పూన్ శనగపిండి వేసి మసాలాను బాగా మగ్గనివ్వాలి.
-మసాలా నూనె పైకి తేలుతున్న సమయంలో.. ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు, వేయించిన గుడ్లు, ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, మూతపెట్టి గ్రేవీ చిక్కబడేవరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-బఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత చివరగా కసూరి మెంతి, గరం మసాలా, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే నోరూరించే దాబా స్టైల్ బఠానీ గుడ్డు మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
