Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
కమ్మగా కడుపునిండా తినాలంటే ఈ పచ్చడి ప్లేట్ లో ఉండాల్సిందే..బోలెడు ప్రయోజనాలు కూడా,ఎలా చేయాలంటే..
పచ్చళ్లల్లో ఒక్కోదానికి ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. అయితే కొన్ని పచ్చళ్లు మాత్రమే టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. అలాంటివాటిల్లో పుదీనా పచ్చడి ఒకటి. పుదీనా పచ్చడి చాలా రుచికరమైన వంటకమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. అన్నం, ఇడ్లీ, దోశ వంటి వాటితో తినడానికి చాలా బాగుంటుంది. పుదీనాలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పుదీనాలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం వంటివి ఉన్నాయి.
పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని
పెంచడానికి సహాయపడుతుంది. కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి
సమస్యలను కూడా నివారిస్తుంది. నోటి దుర్వాసనను నివారిస్తుంది, చిగుళ్ళ
సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి,కొవ్వును కరిగించడానికి
సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు, చర్మంపై మంటను తగ్గిస్తుంది. శ్వాసకోశ
సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది దగ్గు, జలుబు, ఆస్తమా వంటి
వాటిని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన పుదీనాతో పచ్చడిని తయారు చేసుకోడానికి
కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మేక పిచ్చల కూర..శక్తికి, తృప్తికి ఫర్ఫెక్ట్ రెసిపి,ఎలా చేసుకోవాలంటే..
పుదీనా పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
పుదీనా ఆకులు: 1 కప్పు
కరివేపాకు: 1 రెమ్మ
మినపప్పు: 1 టీ స్పూన్
శనగపప్పు: 1 టీ స్పూన్
ఆయిల్: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 4-5
ఎండుమిర్చి: 2
ఆవాలు: 1 టీ స్పూన్
చింతపండు: నిమ్మకాయ సైజు
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1/2 టీ స్పూన్

పుదీనా పచ్చడి తయారీ విధానం
-పుదీనా పచ్చడి తయారీకోసం ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి.
-తర్వాత పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోయాలి.
-ఇప్పుడు చింతపండును నీటిలో నానబెట్టి, గుజ్జు తీయాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడయ్యాక ఇందులో కరివేపాకు, జీలకర్ర,ఆవాలు,మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
-తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి వేయించాలి.
-పుదీనా ఆకులు వేగిన తర్వాత అందులో చింతపండు గుజ్జు, ఉప్పు వేసి బాగా కలపాలి.
-పచ్చడి చిక్కబడే వరకు ఉడికించి దించేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే పుదీనా పచ్చడి రెడీ. పుదీనా పచ్చడిని మితంగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి పుదీనా పచ్చడి వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications