Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
Pudina Roti Pachadi: పుదీనా రోటి పచ్చడి.. కమ్మనైన రుచి వచ్చేలా ఎలా చేసుకోవాలంటే?
రోటి పచ్చడి ఏదైనా ఎంతో రుచికరంగా ఉంటుంది. అందులోనూ పుదీనా రోటి పచ్చడి రుచి మాత్రం చెప్పనవసరం లేదు. సాధారణంగానే పుదీనా చాలా రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో చేస్తుంది. అలాంటి పుదీనాతో రోటి పచ్చడి చేసుకుంటే ఆ రుచి డబల్ అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచింది. వెంట వెంటనే వంట చేసుకోవాలి అనుకునే వ్యక్తులు ఈ రోటి పచ్చడిని ట్రై చేయొచ్చు. ఈ రోటి పచ్చడికి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా దీనిని చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో చూద్దాం.

పుదీనా రోటి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కట్టల ఫ్రెష్ పుదీనా
- రెండు చిన్న సైజు ఉల్లిపాయలు
- పదిహేను పచ్చి మిరపకాయలు
- ఒక చెంచా జీలకర్ర
- రెండు చెంచాల ధనియాలు
- గుప్పెడు కరివేపాకులు
- చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు
- యాభై గ్రాముల తెల్ల నువ్వులు
- నూనె
- రుచికి సరిపడా ఉప్పు
- ఆవాలు
- ఇంగువ
- రెండు ఎండుమిర్చి
పుదీనా రోటి పచ్చడి తయారీ విధానం
పుదీనా రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా పుదీనా ఆకులను తుంపుకొని రెండు సార్లు స్వచ్ఛమైన నీటితో శభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న పుదినాను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై ఒక కడాయి పెట్టి అందులో తెల్ల నువ్వులు వేయించుకోవాలి. తెల్ల నువ్వు చిటపటాలాడిన తరువాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ధనియాలు కూడా అదే కడాయిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయిలో రెండు చెంచాల నూనె వేసి అందులోనే పచ్చి మిరపకాయలు కూడా వేయించుకోవాలి. పచ్చి మిరపకాయలు వేగాక అందులోనే జీలకర్ర, అలాగే కరివేపాకులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కడాయిలో ఒక చెంచా నూనె వేసుకొని పుదీనాను కూడా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు పుదీనాలో నీరు ఊరుతుంది. ఆ నీరు మొత్తం ఆవిరి అయిపోయేంత వరకు వేయించుకోవాలి. అలా నీరు మొత్తం ఆవిరైపోయాక పుదీనాను తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు రోటి అయితే రోటి లేదా మిక్సీ అయితే మిక్సీలో తెల్ల నువ్వులు, ధనియాలు పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పుదీనా, పచ్చి మిర్చి, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి రుబ్బుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా నలిగిన తరువాత అందులో ముందుగా చేసి పెట్టుకున్న తెల్ల నువ్వులు, ధనియాల పొడిని కూడా వేసుకొని మరోసారి రుబ్బుకోవాలి.
ఇది మొత్తం మెత్తగా రుబ్బుకున్న తరువాత అందులో రెండు ఉల్లిపాయల ముక్కలను వేసుకొని మెత్తగా నలగకుండా దంచుకోవాలి. మెత్తగా నలిగితే పంటి కింద రుచి ఉండదు. ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకుంటేనే రుచి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, కరివేపాకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవంతా వేగాక ముందుగా రుబ్బి పెట్టుకున్న రోటి పచ్చడిపై పోసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా రోటి పచ్చడి సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే అబ్బా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications