తక్కువ టైంలో తయారయ్యే ఆవాల అన్నం..దీన్ని టేస్ట్ ముందు ఏదైనా దిగదుడుపే..ఎలా చేసుకోవాలంటే

Posted By:

పండుగలప్పుడు సాధారణంగా మన తెలుగువాళ్లు ఇళ్లల్లో ఎక్కువగా చేసుకునేది పులిహోర. చింతపండుతో,నిమ్మకాయలతో ఇలా వెరైటీగా పులిహోరని తయారుచేస్తుంటారు. అయితే తమిళనాడులో ఆవాల అన్నంని ప్రసాదంగా తయారుచేస్తుంటారు. ఆవాల ఘాటు, కమ్మరి కొబ్బదనం తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చేస్తుంది ఈ ఆవాల అన్నం. వరలక్ష్మీ వత్రం రోజు ప్రసాదంగా ఎక్కువగా దీన్నే తయారుచేస్తుంటారు. దీన్ని ప్రసాదంగానే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. ఈ వంటకంలో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు అందించేవే. ఇంట్లో సులభంగా ఆవాల అన్నం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఆవాల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు

-పచ్చి కొబ్బరి
-ఆవాలు
-పసుపు
-ఉప్పు
-అన్నం
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-కరివేపాకు
-ఎండుమిరపకాయలు
-ఆయిల్
-నెయ్యి

ఆవాల అన్నం తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఓ కుక్కర్ పెట్టి అందులో 1కప్పు(180 గ్రాములు) కడిగిన బియ్యం వేయండి. ఇందులోనే 1 టీస్పూన్ నూనె,కొద్దిగా ఉప్పు,2 కప్పులు నీళ్లు పోసి మూతపెట్టి రెండు విజిల్స్ పెద్ద మంట మీద 1 విజిల్ తక్కువ మంట మీద రానివ్వండి.

-స్టీమ్ అంతా పోయేదాకా ఆగి మూత తియ్యాలి. అన్నం పొడి పొడిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఒకసారి గరిటతో అటు ఇటు కదపండి.

-తర్వాత మిక్సీ గిన్నెలో 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఉప్పు,అర టీస్పూస్ పసుపు,అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో పావుకప్పు ఆయిల్ వేడి చేసి 1 టేబుల్ పచ్చి శెనగపప్పు, 1 టీస్పూన్ పొట్టు మినపప్పు వేసి వేయించాక 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి నూనె పైకి తేలేంతవరకు బాగా కలుపుతూ వేయించాలి.

-వేగి ముద్దగా అయిన తర్వాత ఇందులో ఉడకించిన అన్నం వేసి బాగా కలపండి.

-దించేముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి అందులో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ప్రసాదం ఆవాల అన్నం రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, July 17, 2025, 12:40 [IST]
Desktop Bottom Promotion