Latest Updates
-
రోజూ తినే రైతాతో బోర్ కొట్టిందా? అయితే కమ్మని తడ్కా వెజిటబుల్ రైతా ట్రై చేయండి! -
శాడిస్ట్ పెళ్లాంతో తట్టుకోలేకపోతున్నా: భార్య శృంగార కోరిక తీర్చలేక..పోలీస్ స్టేషన్ లో భర్త కంప్లెయింట్! -
రైస్ పొటాటో ఊతప్పం..ఇంతకుముందు తిన్న ఊతప్పం రుచులన్నీ మర్చిపోతారు! -
Hanuman Mantras: మోస్ట్ పవర్ ఫుల్ హనుమాన్ మంత్రాలు..దెయ్యాలు కూడా గజగజ వణకాల్సిందే! -
సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - గురువారం, 02 ఏప్రిల్ 2026 -
నోటికి ఏమీ రుచించట్లేదా? అయితే ఈ ఘాటైన వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి! -
జై భజరంగ్ బలి..మీ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి విషెస్ ఇలా అందంగా చెప్పండి! -
నోరూరించే గోంగూర బోటీ.. ఇలా వండితే రుచి అదుర్స్! -
హనుమాన్ చాలీసా ఎలా చదవాలి? మీ కోరికలు తీరాలంటే ఈ 4 నియమాలు పాటించాల్సిందే! -
హనుమాన్ జయంతి స్పెషల్..స్వామికి ఇష్టమైన తీపి బూందీ ఇంట్లోనే ఇలా సులభంగా చేయండి!
పక్కా స్ట్రీట్ స్టైల్ మోమోస్ చట్నీ..దీన్ని నంజుకొని తింటుంటే ఎన్నైనా అలా పోతూ ఉంటాయ్!
వేడి వేడి ఆవిరి మీద ఉడికిన మోమోస్ చూడగానే ఎవరికైనా నోరూరాల్సిందే. అయితే, మోమోస్ ఎంత అద్భుతంగా ఉన్నా, వాటి అసలైన రుచి దాగి ఉండేది మాత్రం ఆ పక్కన ఇచ్చే ఎర్రటి కారపు చట్నీలోనే. మోమోస్ స్వతహాగా చాలా తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి. కానీ ఆ ఘాటైన, పుల్లటి చట్నీలో ముంచుకుని తిన్నప్పుడు మాత్రం ఆ అనుభూతే వేరు.
చాలామంది ఇష్టపడి ఇంట్లోనే రకరకాల మోమోస్ తయారు చేసుకుంటారు. కానీ ఆ వీధి బండి దగ్గర లేదా రెస్టారెంట్లో దొరికే చట్నీ రుచి మాత్రం రాదు. దాంతో మోమోస్ తినడంలోని మజా సగం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. అయితే సరైన కొలతలు, సరైన మసాలాలు వాడితే ఆ స్ట్రీట్ స్టైల్ చట్నీని మీరు ఇంట్లోనే చిటికెలో తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు కూడా మన వంటగదిలో ఎప్పుడూ ఉండేవే.
మోమోస్ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
-ఎర్రగా పండిన టమోటాలు
-ఎండు మిరపకాయలు
-వెల్లుల్లి,అల్లం
-ఉప్పు
-కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం
-కొద్దిగా సోయా సాస్
మోమోస్ చట్నీ తయారీ విధానం
-ముందుగా తాజా టమోటాలను శుభ్రంగా కడిగి పెట్టుకోండి.
-ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో టమోటాలతో పాటు ఎండు మిరపకాయలను కూడా వేసి ఉడికించండి. టమోటాలు, ఎండుమిర్చి బాగా మెత్తబడే వరకు ఉంచాలి.
-టమోటాల పై తొక్క విడిపోతున్నట్లు కనిపించగానే స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత టమోటాల పై ఉన్న తొక్కను తీసేయండి. ఇలా చేయడం వల్ల మీ చట్నీ చాలా స్మూత్ గా వస్తుంది. ఎండు మిర్చిలోని నీటిని కూడా వడకట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో ఉడికించి తొక్క తీసిన టమోటాలు, నానబెట్టిన ఎండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలపండి. చివరగా కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం వేసి మరోసారి బ్లెండ్ చేయండి.
-చట్నీకి అదనపు రుచి రావాలంటే, ఒక చిన్న పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేడి చేయండి. అందులో ఈ చట్నీ మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద తేలికగా ఉడికించండి. ఇలా చేయడం వల్ల పచ్చి వాసన పోయి, రుచి అమాంతం పెరుగుతుంది.
-మీ చట్నీ అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో ఉండాలంటే.. తాలింపు వేసేటప్పుడు కొద్దిగా నువ్వులు లేదా నువ్వుల నూనె వాడండి. దీని రుచి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. చట్నీని మరీ ఎక్కువ సేపు ఉడికించకూడదు, అలా చేస్తే దాని ఫ్రెష్ నెస్ పోతుంది. మీకు నచ్చినట్లుగా మెత్తగా లేదా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












