మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Posted By:

మన ఇళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీ. మనం ఎంత లెక్కపెట్టి చేసినా ఒక్కోసారి కొన్ని ఇడ్లీలు మిగిలిపోతూనే ఉంటాయి. చల్లారిపోయిన ఆ ఇడ్లీలను మళ్లీ తినాలంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. అలా అని పడేయలేం. మరి ఆ మిగిలిపోయిన ఇడ్లీలతో ఏం చేయాలి? ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానమే స్పైసీ ఇడ్లీ ఫ్రై.

ఒక్కసారి మీరు ఈ ఇడ్లీ ఫ్రై రుచి చూశారంటే ఆ తర్వాత ఎప్పుడూ ఇడ్లీలు మిగిలిపోలేదని బాధపడరు.. పైగా ఈ ఫ్రై చేయడం కోసమే ఉద్దేశపూర్వకంగా మరికొన్ని ఇడ్లీలను అదనంగా చేస్తారు. పిల్లల స్నాక్స్ బాక్స్ లోకి కానీ, సాయంత్రం టీ టైమ్ లో కానీ ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సూపర్ టేస్టీ ఇడ్లీ ఫ్రై ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Quick Delicious Spicy Idli Fry Recipe in Telugu Transform Leftover Idli into a Mouth Watering Treat

స్పైసీ ఇడ్లీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు

మిగిలిపోయిన ఇడ్లీలు - 10
ఉల్లిపాయ - 1
టమోటా - 1
పచ్చిమిర్చి - 1
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
సాంబార్ మసాలా - 1 టీస్పూన్
ఎర్ర కారం - పావు టీస్పూన్
ఉప్పు -సరిపడా
కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్

స్పైసీ ఇడ్లీ ఫ్రై తయారీ విధానం

-ముందుగా చల్లారిన ఇడ్లీలను తీసుకుని, ఒక్కో ఇడ్లీని చిన్న చిన్న చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడుతూ మంచి సువాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

-ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అందులో సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేయాలి. టమోటాలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించి, ఆ తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ఈ రెసిపీకి ప్రాణం లాంటి సాంబార్ మసాలా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు వేయించాలి.

-మసాలా మిశ్రమం బాగా వేగిన తర్వాత.. కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను అందులో వేయాలి. మసాలా అంతా ఇడ్లీ ముక్కలకు బాగా పట్టేలా నిదానంగా పైకి కిందకి కలుపుకోవాలి. ఇడ్లీలు మరీ మెత్తగా అయిపోయి విరిగిపోకుండా జాగ్రత్తపడాలి.

-మసాలాతో ఇడ్లీ ముక్కలు కలిసిన తర్వాత, కేవలం 1 నుండి 2 నిమిషాల పాటు సన్నటి సెగపై ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. అంతే స్పైసీ ఇడ్లీ ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, March 7, 2026, 10:53 [IST]
Desktop Bottom Promotion