అబ్బ, ఏం రుచి!.. నోరూరించే మసాలా క్యారెట్ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

రోజూ ఉదయాన్నే లేవగానే గృహిణులకు, ఉద్యోగస్తులకు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న..ఈ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి?. ఇడ్లీ, దోశ పిండి అందుబాటులో లేనప్పుడు లేదా రోజూ తినే ఉప్మా వంటివి బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తగా, రుచికరంగా తినాలనిపిస్తుంది. అదే సమయంలో ఉదయం ఉండే పని ఒత్తిడిలో ఎక్కువ సమయం వంటగదిలో గడపలేం.

ఇలాంటి సమయంలో తక్కువ పదార్థాలతో, అతి తక్కువ సమయంలో తయారయ్యే అద్భుతమైన,నోరూరించే వంటకమే క్యారెట్ రైస్. సాధారణంగా మనం తినే పులిహోర, పలావ్ వంటి వాటికి ఇది ఏమాత్రం తీసిపోదు సరికదా వాటికంటే రెట్టింపు రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. రుచికరమైన క్యారెట్ రైస్‌ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Quick Easy and Delicious Carrot Rice Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
-వండిన అన్నం
-క్యారెట్ తురుము
-ఆవాలు
-జీలకర్ర
-మినప్పప్పు
-యాలకలు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-జీడిపప్పు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
-కొబ్బరి తురుము
-సాంబార్ పొడి
-ధనియాల పొడి
-పసుపు
-నిమ్మకాయ
-నూనె
-రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క వేసి, వెంటనే జీడిపప్పును కూడా వేసి దోరగా వేయించాలి.

-జీడిపప్పు బంగారు రంగులోకి రాగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 30 సెకన్ల పాటు వేయించాలి.

-ఉల్లిపాయలు కాస్త వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు క్యారెట్ తురుమును పాన్‌ లో వేయాలి. క్యారెట్ పచ్చి వాసన పోయి, చక్కగా మగ్గేంత వరకు వేయించాలి.

-క్యారెట్ వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు, ధనియాల పొడి, సాంబార్ పొడి వేయాలి. ఈ మసాలాలు మాడిపోకుండా ఉండటానికి, పేస్ట్‌ లా అవ్వడానికి ఒకటి లేదా రెండు చెంచాల నీరు చల్లి బాగా కలపాలి.

-మసాలా మిశ్రమం సిద్ధమయ్యాక ముందుగా వండుకుని చల్లార్చుకున్న అన్నాన్ని లేదా రాత్రి మిగిలిన అన్నం అయినా పాన్‌ లో వేయాలి. మసాలా అంతా అన్నానికి పట్టేలా నిదానంగా కలపాలి.

-అన్నం బాగా కలిశాక, పచ్చి కొబ్బరి తురుము చల్లి స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మరసం పిండాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి.

-అంతే ఘమఘమలాడే వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ. ఇది కేవలం 10-15 నిమిషాల్లో పూర్తవుతుంది. దీని రుచి మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ గా తిన్నా, మధ్యాహ్నం లంచ్ బాక్స్‌ లో తీసుకెళ్లినా ఇది ఎంతో బాగుంటుంది.

-కూరగాయలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఇలా రంగురంగుల క్యారెట్ రైస్ చేసి పెడితే లంచ్ బాక్స్ ఖాళీ అవ్వడం ఖాయం.

[ of 5 - Users]
Story first published: Sunday, November 30, 2025, 6:43 [IST]
Desktop Bottom Promotion