Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
రాగి వెజిటేబుల్ పాన్‌కేక్ / ఊతప్పం చలికాలంలో నోటికి కమ్మటి రుచితో..!
వర్షాకాలంలో వరైటీ బ్రేక్ ఫాస్ట్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రాగి వెజిటేబుల్ పాన్‌కేక్ / ఊతప్పం చలికాలంలో నోటికి కమ్మటి రుచితో రాగి రొట్టి కంటే రాగి పాన్ కేక్ సులభంగా తయారుచేసుకోవచ్చు. రాగి పాన్‌కేక్‌లు రాగి పిండి లేదా ఫింగర్ మిల్లెట్ పిండితో చేసేటటువంటి మెత్తటి, తేలికైన మరియు రుచికరమైన పాన్‌కేక్‌లు. రాగి పిండితో మనం వివిధ రకాలుగా వంటలు తయారుచేసుకుంటాం. అందులో రాగి గంజి, దోసె, పుట్టు మరియు రోటీ వంటి అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ రోజు మనం రాగి పిండితో గోధుమప పిడి మిశ్రమంతో ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ రాగి పాన్ కేక్ గురించి తెలుసుకుందాం.
త్వరగా తయారుచేసుకోగలిగ ఆరోగ్యకరమైన చిరుతిండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఫైబర్ యొక్క మంచి మూలం.రాగుల్లో (ఫింగర్ మిల్లెట్ పిండి) కాల్షియం, ప్రోటీన్ మరియు ఫైబర్‌తో నిండిన చాలా పోషకమైన అంశం. ఈ కీలక పోషకం రక్తంలో చక్కెర స్థాయిలు మరియు రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు హార్ట్ పేషంట్స్ ఈ అల్పాహారంను హ్యాపిగా తినొచ్చు. అదనంగా, ఫైబర్ సంతృప్తిని జోడిస్తుంది మరియు అతిగా తినడం నివారిస్తుంది. కాబట్టి బరువు చూసేవారు కూడా ఈ పోషకమైన అల్పాహారాన్ని ఆస్వాదించవచ్చు.

కావలసిన పదార్థాలు
- రాగిపిండి: 1 cup
- గోధుమపిండి: 1/2 cup
- బియ్యపుపిండి: 1/4 cup
- ఉల్లిపాయ: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
- క్యాప్సికమ్: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
- క్యారెట్: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
- బీన్స్: 4 (సన్నగా కట్ చేసుకోవాలి)
- పచ్చిమిర్చి: 4 (సన్నగా కట్ చేసుకోవాలి)
- ఉప్పు: రుచికి తగినంత
- నూనె: కొద్దిగా,
- కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారుచేయు విధానం :
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయాలి
- తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, బీన్, కూరగాయలను సన్నగా తరిగి పిండిలో వేయాలి
- అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలపాలి
- ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి, సరిపడా నీళ్లుపోసి దోశపిండిలా జారుగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా, పల్చగాను కాకుండా కలుపోవాలి
- పిండి సిద్దం చేసుకున్న తర్వాత స్టవ్‌మీద పాన్‌పెట్టి, ఒక టీస్పూన్ నూనె వేయాలి.పాన్ బాగా వేడయ్యాక పిండి మిశ్రమాన్ని కాస్త మందంగా పోయాలి. పిండిని పాన్ మొత్తం స్ప్రెడ్ చేకూడదు.
- తర్వాత దోసకు రెండు వైపులా నూనెవేసి మీడియం మంట మీద కాల్చుకోవాలి. దీన్ని పాన్ కేక్ లేదా వెజిటేబుల్ ఊతప్పం అంటారు.
- పాన్ కేక్ రెండు వైపులా కాలిన తర్వాత. పైనుంచి కొత్తిమీర తురుము చల్లుకుంటే వేడివేడి రాగి వెజ్ పాన్‌కేక్ సిద్ధం.
- సాధారణ పిండితో చేసిన పాన్‌కేక్‌లతో పోలిస్తే, ఈ రాగి పాన్‌కేక్‌లు ఉడికించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎక్కువసేపు కాల్చుకోవాలి.
- వాటిని పాన్ నుండి తీసి రుచికరమైన కొబ్బరి చట్నీతో సర్వ్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications