Latest Updates
-
కాఫీ, టీలు ఎక్కువ తాగుతున్నారా? అయితే ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
ఈద్ ఉల్ ఫితర్ 2026..మీ బంధుమిత్రులకు రంజాన్ విషెస్ ఇలా అందంగా చెప్పండి! -
ఈరోజు రాశి ఫలాలు (21.03.26): శని దేవుని అనుగ్రహం ఎవరిపై ఉంటుంది? మీ జాతకం ఇక్కడ చూడండి! -
మష్రూమ్ చికెన్ మసాలా..కిర్రాక్ టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు!
రొటీన్ మటన్ కూరలతో బోర్ కొట్టిందా? అయితే ఈ రంజాన్ కు క్రీమీ ఆఫ్ఘానీ మటన్ ట్రై చేయండి..డబుల్ మజా!
ప్రతిసారీ రొటీన్ గా ఒకేలాంటి మటన్ గ్రేవీలు, కుర్మాలు చేసి బోర్ కొట్టిందా? ఈసారి రంజాన్ పండుగకు కాస్త వెరైటీగా, అందరినీ ఆశ్చర్యపరిచేలా ఏదైనా వండాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆఫ్ఘానీ మటన్ ట్రై చేయండి.
చాలా క్రీమీగా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది. ఇది కేవలం బిర్యానీలోకి మాత్రమే కాదు.. వేడి వేడి చపాతీ, నాన్, బగారా రైస్ లేదా పులావ్ తో తింటే దీని రుచి అమోఘం.
ఆఫ్ఘానీ మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - పావు కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయలు - 1/2 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
బోన్‌లెస్ మటన్ - 800 గ్రాములు
గట్టి పెరుగు - అర కప్పు
జీలకర్ర పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
కాశ్మీరీ కారం పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
టమాటాలు - 2
ఉప్పు - మీ రుచికి తగినంత
వేడినీళ్లు - 3 కప్పులు
ఫ్రెష్ క్రీమ్ - పావు కప్పు
కసూరి మేతి - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
అప్ఘానీ మటన్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి వెడల్పాటి బాండీ పెట్టుకుని అందులో పావు కప్పు నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనిచ్చాక అందులోనే తరిగిన ఉల్లిపాయలను వేసి, అవి చక్కటి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి.
-ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించండి. వెంటనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి కలపండి.
-ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్ లెస్ మటన్ ముక్కలను వేసి, మసాలాలు ముక్కలకు పట్టేలా కలుపుతూ సుమారు 8 నిమిషాల పాటు వేయించండి.
-ఈలోపు ఒక చిన్న గిన్నెలో పెరుగు తీసుకుని.. అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కాశ్మీరీ కారం వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఈ మసాలా పెరుగు మిశ్రమాన్ని మటన్ లో వేసి బాగా కలపండి.
-నూనె పైకి తేలాక అందులో మెత్తగా చేసిన టమాటా గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మంటను మీడియంలో ఉంచి మరో 4-5 నిమిషాలు ఉడికించండి.
-ఇప్పుడు 3 కప్పుల వేడినీళ్లు పోసి బాగా కలపండి. నీరు మరగడం ప్రారంభించగానే మూత పెట్టి మంటను తగ్గించి 40 నుండి 45 నిమిషాల పాటు మటన్ ను మృదువుగా ఉడకనివ్వండి.
-45 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు అందులో పావు కప్పు క్రీమ్ వేసి కలపండి. చివరగా చేతితో నలిపిన కసూరి మేతి,కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఆఫ్ఘానీ మటన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)

