Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
రాయలసీమ స్పెషల్ వంకాయ అలసందల పులుసు..ఎలా చేసుకోవాలంటే
రాయలసీమ వంటలు అనగానే గుమగుమలాడే కారపు వాసన, విలక్షణమైన రుచులు గుర్తుకొస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది వంకాయ అలసందల పులుసు. ఇది రాయలసీమలో ప్రతి ఇంట్లో తరచుగా చేసుకునే ఒక సాంప్రదాయ వంటకం. వంకాయ, అలసందల కలయికతో పులుసు రుచిలో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇది కేవలం రుచిలోనే కాకుండా, పోషకాల పరంగా కూడా చాలా ప్రయోజనకరమైనది. తాజా వంకాయలు, అలసందలతో చేసే ఈ పులుసు వేడివేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి అద్భుతమైన కాంబినేషన్. రాయలసీమ స్పెషల్ వంకాయ అలసందల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు, వాటి తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-వంకాయలు: 250 గ్రాములు
-అలసందలు: 1/2 కప్పు
-చింతపండు: నిమ్మకాయంత సైజు
-ఉల్లిపాయ: 1
-పచ్చిమిర్చి: 3-4
-టమాటాలు: 1
-కరివేపాకు: 2 రెబ్బలు
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
-నూనె: 2 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీ స్పూన్
-జీలకర్ర: 1/2 టీ స్పూన్
-మెంతులు: 1/4 టీ స్పూన్
-ఇంగువ: చిటికెడు
-పసుపు: 1/2 టీ స్పూన్
-కారం: 1 టీ స్పూన్
-ధనియాల పొడి: 1 టీ స్పూన్
-బెల్లం: చిన్న ముక్క
-ఉప్పు: సరిపడా
-వేరుశెనగలు: 2 టేబుల్ స్పూన్లు
-నువ్వులు: 1 టేబుల్ స్పూన్
-ఎండుకొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
-ధనియాలు: 1 టీ స్పూన్
-జీలకర్ర: 1/2 టీ స్పూన్
-గసగసాలు: 1 టీ స్పూన్

తయారీ విధానం
-ముందుగా అలసందలను రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత అలసందలను శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకొని నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత చింతపండును వేడినీటిలో నానబెట్టి మెత్తగా చేసి, చిక్కటి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో వేరుశెనగలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర, గసగసాలు విడివిడిగా వేయించి చల్లార్చాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో లేదా రోట్లో వేసి కొద్దిగా నీటితో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
-తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసి వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి.
-ఆవాలు చిటపటలాడాక ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి.
-ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, పసుపు వేసి టమాటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
-టమాటాలు మగ్గాక కారం, ధనియాల పొడి వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి.
Kova bobbatlu: కాకినాడ స్పెషల్ కోవా బొబ్బట్లు..అద్భుతమైన రుచి, ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు అందులో ఉడికించిన అలసందలు,చింతపండు గుజ్జును పోసి తగినంత నీళ్లు పోసి బాగా కలపాలి. ఉప్పు, బెల్లం వేసి రుచికి సరిపడా చూసుకోవాలి.
-ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి బాగా కలిపి మీడియం మంటపై 10-15 నిమిషాలు బాగా మరగనివ్వాలి.
-పులుసు బాగా చిక్కబడి, నూనె పైకి తేలగానే కొత్తిమీర తరుగుతో అలంకరించి దించేయాలి. అంతే వంకాయ అలసందల పులుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications