Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రాయలసీమ స్టైల్ లో పల్లీ చట్నీ..ఆహా ఏమి రుచిరా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
రాయలసీమ వంటకాలు చాలా ప్రత్యేకమైనవి, ఆరోగ్యకరమైనవి. ఆ వంటకాలలో ముఖ్యమైనది పల్లీల చట్నీ. ఈ చట్నీని చాలా రకాలుగా చేస్తారు. పల్లీ చట్నీ రుచిగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే దీనిని ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. దీనిని ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా, పల్లీ చట్నీని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పల్లీ చట్నీ మంచిది. దీనిని ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా లాంటి వాటితో తినడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. రాయలసీమలో పల్లీ చట్నీని దాదాపు ప్రతి రోజూ తింటారు. రాయలసీమ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-వేరుశెనగపప్పు
-ఆవాలు
-ఎండుమిర్చి
-జీలకర్ర
-కరివేపాకు
-ఉల్లిపాయ
-వెల్లుల్లి
-అల్లం
-టమాటో
-చింతపండు
-ఆయిల్
రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు(వేరుశెనగపప్పు)వేసి తక్కువ మంట మీద వేయించుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో 1 పెద్ద ఉల్లియను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీస్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయల ముక్కలు, ఒక చిన్న అల్లం తరుగు, చిన్న టమాటో తరుగు, 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం మంట మీద టమాటో ముక్కలు మగ్గేదాకా వేయించుకోవాలి.
-తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జర్ లో వేయండి. ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, రెండు రెబ్బల చింతపండు కూడా వేసి కొంచెం నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత తాళింపు కోసం ప్టవ్ మీద బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేసి ఇందులో అర టీస్పూన్ పచ్చి శెనగపప్పు, అర టీస్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-వేయించిన తాళింపును ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసి కలపాలి. అంతే టేస్టీ,స్పైసీ రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. దీనిని బ్రేక్ ఫాస్ట్ లో కలుపుకొని తింటుంటే ఆహా ఏమి రుచిరా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







