Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నోరూరించే ఎగ్ బిర్యానీ..రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతదేశంలో ముఖ్యంగా సౌతిండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో ఎగ్ బిర్యానీ ఒకటి. ఇది సుగంధభరితమైన బాస్మతి బియ్యం, ఉడికించిన గుడ్లు, సుగంధ ద్రవ్యాలు, తాజా మూలికల కలయికతో తయారవుతుంది. మాంసం తినని వారికి లేదా తేలికపాటి బిర్యానీని ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దీనిని తయారుచేయడం కొద్దిగా సమయం పడుతుంది కానీ దాని రుచికి, పోషక విలువలకు ఇది తప్పకుండా విలువైనది. రెస్టారెంట్లో అమ్మే బిర్యానీకి మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా ఎగ్ బిర్యానీని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఎగ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-గుడ్లు
-బాస్మతి రైస్
-వెల్లుల్లి
-ఉల్లిపాయ
-అల్లం
-ఆయిల్
-నెయ్యి
-ఉప్పు
-కారం
-పచ్చిమిర్చి
-టమాటో
-బిర్యానీ ఆకు
-యాలకలు
-స్టార్ అనాస
-రాతి పువ్వు
-మరాఠీ మొగ్గ
-కొత్తిమీర
-పుదీనా
-ధనియాల పొడి
-గరం మసాలా
-బిర్యానీ మసాలా
-పసుపు
-జీలకర్ర
-షాజీరా
-మిరియాలు
తయారీ విధానం
-ముందుగా 6 గుడ్లను ఉడికించండి.
-గుడ్లు ఉడికేలోగా ఒక గిన్నెలోకి 1 గ్లాసు బాస్మతి రైస్(300 గ్రాములు)వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టండి.
-ఉడికిన గుడ్లను పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ లేదా కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేశాక అందులో 1 ఉల్లిపాయ చీలికలు వేసి,10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయండి.
-ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యాక అందులో 1 టమాటో ముక్కలు వేసి అవి మెత్తగా మగ్గేదాకా ఫ్రై చేసి కడాయిలో నుంచి తీసి మిక్సీ జార్ లో వేయండి. ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోనే 2 టీస్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక అందులో పావు టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ కారం,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఉడికించిన గుడ్డులకు చాకుతో లైట్ గా గాట్లు పెట్టి ఇందులో వేయండి. కలర్ మారి గోల్డెన్ రంగులోకి వచ్చాక వీటిని తీసి ఓ ప్లేట్ లో పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి ఇందులో సన్నగా తరగిన 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత సగం ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు సగం ఉల్లిపాయలు ఉన్న స్టవ్ మీద గిన్నెలో 2 యాలకలు, 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, రాతి పువ్వు, 5 లవంగ మొగ్గలు, 10 మిరియాలు, స్టార్ అనాస, 1 టీస్పూన్ షాజీరా, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేశాక ఇందులోనే గ్రైండ్ చేసుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి.
-తర్వాత అందులో అరకప్పు పెరుగు వేసి బాగా కలిపాక పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి, 1 టీస్పూన్ బిర్యానీ మసాలా వేసి ఇవన్నీ మాడిపోకుండా కొంచెం నీళ్లు పోసి తక్కువమంట మీద బాగా కలపండి.
-ఇప్పుడు అందులో కొద్దిగా పుదీనా ఆకు, కొత్తిమీర తరుగు వేసి కలిపాక నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి బాగా కలిపి రైస్ వేసి గ్లాసుతోనే ఒకటి ముప్పావు గ్లాసు నీళ్లు పోసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
-దాదాపు ఉడకడం దగ్గరపడిన సమయంలో ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసి, కొంచెం కొత్తిమీర ఆకు చల్లుకొని, ఉడికించి ఫ్రై చేసుకున్న గుడ్లను కూడా వేసి 2 టీస్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి 10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








