Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పనీర్ బుర్జీ మసాలా..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలం
చాలామంది రాత్రిపూట అన్నంకి బదులుగా చపాతీ లేదా రోటీలు లేదా పుల్కాలు తింటుంటారు. కొందరు అప్పుడప్పుడు రాత్రి పూట డిన్నర్ లోకి చపాతీలు తింటుంటారు. వేడి వేడి చపాతీల్లోకి జతగా ఏదైనా రుచికరమైన కూర ఉంటే ఆ మజాయే వేరు. చపాతీలోకి కేవలం పది నిమిషాల్లో అయిపోయే పనీర్ బుర్జీ మసాలా ట్రై చేయండి.
ఈ వంటకం రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీరు సాధారణంగా తినేవాటి కంటే ఖచ్చితంగా రెండు చపాతీలు ఎక్కువే లాగిస్తారు. బ్యాచిలర్లు, ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అతిథులు వచ్చినా, కంగారు పడకుండా క్షణాల్లో రుచికరమైన వంటకాన్ని వారి ముందు ఉంచవచ్చు. ఘుమఘుమలాడే పనీర్ బుర్జీ మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
సోంపు - అర టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
పెద్ద టమాటాలు - 3
ఉప్పు - మీ రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
పసుపు -పావు టీస్పూన్
నీరు - సుమారు 2 కప్పులు
పనీర్ - 250 గ్రాములు
కొత్తిమీర - కొద్దిగా
వెన్న లేదా నెయ్యి - 1 టీస్పూన్
తయారుచేయు విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నూనె పోసి, అది కాస్త వేడెక్కాక సోంపు వేయండి. సోంపు చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు శనగపిండిని వేసి పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేవరకు దోరగా తక్కువ మంట మీద వేయించండి.
-ఆ తర్వాత పాన్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి, వాటి పచ్చిదనం పోయేంతవరకు వేయించండి. ఆ తర్వాత, సన్నగా తరిగిన టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించండి.
-టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేయాలి. మొత్తాన్ని బాగా కలిసి, నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించండి. ఈ దశలో ఒక కప్పు నీళ్లు పోసి, గ్రేవీని బాగా ఉడకనివ్వండి.
-గ్రేవీ మరుగుతున్నప్పుడు చేతితో మెత్తగా నలుపుకున్న పనీర్ ను వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మరో కప్పు నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోండి. అవసరమైతే కొద్దిగా వేసి మూతపెట్టి 4-5 నిమిషాలు ఉడికించండి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక టీస్పూన్ వెన్న లేదా నెయ్యి వేసి కలిపితే ఘుమఘుమలాడే, నోరూరించే పనీర్ బుర్జీ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications