Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
గుండె ఆరోగ్యానికి,ఎముకల దృఢత్వానికి బెస్ట్..పూల్ మఖానాతో స్వీట్ అండ్ క్రిస్పీ స్నాక్..ఎలా చేసుకోవాలంటే
కారమెల్ మఖానా అనేది మఖానా (తామర గింజలు)తో తయారు చేసే ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్నాక్. సాధారణంగా సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీతో ఏదైనా తినాలని అనిపించినప్పుడు, చిప్స్ లేదా వేయించిన వస్తువులకు బదులుగా ఈ కారమెల్ మఖానాను ఎంచుకోవచ్చు. దీని రుచి కరకరలాడుతూ, తీయగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది నచ్చుతుంది. ఈ స్నాక్ తయారు చేయడం చాలా సులభం, ఎక్కువ సమయం కూడా పట్టదు.
దీని తయారీకి అవసరమయ్యే పదార్థాలు కూడా ఇంట్లో సులభంగా లభించేవే. సాధారణంగా మఖానాను ఉప్పు, కారం కలిపి వేయించుకుంటారు. కానీ కారమెల్ మఖానా అనేది పూర్తిగా భిన్నమైన రుచిని ఇస్తుంది. ఇది స్వీట్, క్రిస్పీగా ఉంటుంది. కారమెల్ మఖానా కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి బోలెడు మేలు చేసే పూల్ మఖానా స్నాక్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-నువ్వులు
-పూల్ మఖానా
-నెయ్యి
-బెల్లం
పూల్ మఖానా స్నాక్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు పల్లీలు(వేరుశెనగ పప్పు)వేసి ఫ్రై చేసుకోవాలి.
-వేగిన పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి లైట్ గా దంచిపెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఫ్రై చేసి తీసి వేరే బౌల్ లో ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లోనే కొంచెం నెయ్యి వేసి వేడి చేసి అందులో 2 కప్పుల పూల్ మఖానా వేసి తక్కువ మంటమీద నెమ్మదిగా అవి క్రిస్పీ అయ్యేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోండి
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లోనే అరకప్పు బెల్లం వేసి కరిగించాలి. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి.
-బెల్లం మిశ్రమం ఒక పొంగు వచ్చినప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచిన పూల్ మఖానా, గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం, వేయించిన నువ్వులు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
-నెయ్యి రాసిన ప్లేట్ లోకి వీటిని వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే సపరేట్ చేసుకోవాలి. అంతే హెల్తీ పూల్ మఖానా స్నాక్ రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే దాని కరకరలాడే గుణం చాలా రోజుల వరకు ఉంటుంది.
కొన్ని ప్రయోజనాలు
మఖానాలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలపరుస్తుంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు కాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది. వారికి మఖానా ఇవ్వడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. రెగ్యులర్ గా మఖానా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇది ఒక మంచి ఆహారం. అయితే, ఏదైనా ఆహారం తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









