Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్
క్రిస్‌మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్రిస్‌మస్ ట్రీ. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని. ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు.
క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సమయం. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్న వారికి సైతం ఆర్డర్ చేసి మరీ అందచేస్తారు. కొందరు మాత్రం ఇంట్లో చేసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ మీకోసం ఒక కేక్ రిసిపిని తయారుచేసే విధానంతో అంధిస్తున్నాం. మీరు కూడా ప్రయత్నించి మీ క్రియేటివిటీని జోడించి డెకొరేట్ చేయండి...కేక్ కట్ చేసి ఇంటికి వచ్చిన అతిథులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తీయగా అందించండి...

కావల్సిన పదార్థాలు:
మైదా- 1cup
వాల్నట్: 2tbsp (తరిగినవి)
బేకింగ్ పౌడర్: 1/2tsp
ఎండుద్రాక్ష-3tbsp
బ్రౌన్ పంచదార: 1cup
వెనిలా ఎసెన్స్: 3-4చుక్కలు
గుడ్లు: 3
వెన్న: ½cups(మెత్తగా)
లెమన్ జస్ట్: 1tsp
చెర్రీస్: 2tbsp (సగం) గార్నిషింగ్ కోసం
తయారుచేయు విధానం:
1. వోవెన్ ను 160డిగ్రీ సెల్సియస్ లో ఉంచాలి.
2. తర్వాత మైద మరియు బేకింగ్ పైడర్ ను ఒక బౌల్లో వేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో వాల్ నట్స్, ఎండుద్రాక్ష వేసి బాగా మిక్స్ చేయాలి.
4. మరో బౌల్లో, బట్టర్ మరియు బ్రౌన్ షుగర్ వేసి, బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా క్రీమ్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత అందులో వెనీలా ఎసెన్స్ , గుడ్డు, లెమన్ జెస్ట్ వేసి బాగా గిలకొట్టాలి.
5. ఇప్పుడు ఈ మిశ్రమంలో మైదా, బేకింగ్ సోడా మిశ్రమాన్ని వేసి, బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు కేక్ టిన్ కు బట్టర్ అప్లై చేసి, తర్వాత అందులో పైన రెడీ చేసుకొన్న కేక్ మిశ్రమాన్ని పోయాలి.
7. ఈ మొత్తం మిశ్రమాన్ని 15-20నిముషాలు బేక్ చేసిన తర్వాత, చల్లారనివ్వాలి. అంతే క్రిస్మస్ ప్లమ్ కేక్ తినడానికి రెడీ. దీన్ని స్లైస్ గా కట్ చేసి సగం చెర్రీలను గార్నిష్ చేయాలి . మీకు అవసరం అయితే చెర్రీలను కూడా యాడ్ చేయవచ్చు .



Click it and Unblock the Notifications











