For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కూల్...కూల్..బనానా ఐస్ క్రీమ్ స్మూతీ

|

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కంటే...ఏ ఎండకు ఆ షేక్స్ తాగడం బెటర్. షేక్స్‌తో ఎండలకు షాకివ్వవచ్చు. సమ్మర్‌ని షేక్ చేయవచ్చు. మిల్క్ షేక్‌లు..స్మూతీలు ..కడుపును చల్లగా ఉంచుతాయి. ఒంటికీ చలవ చేస్తాయి.

పాలూ పండ్లతో ఒక షేక్. చాకో కోకోలతో ఇంకో షేక్. ఐస్ క్రీములతో మరో షేక్..షేక్. ఎండల్ని రుచికరంగా చల్లబరుచుకోండి. ఈ సమ్మర్‌ను వశపరుచుకోండి. ఇక ఈ బనానా (అరటిపళ్లు) కూడా విరివిగా లభిస్తున్నాయి. పిల్లలు అలాగే తినమంటే తినరు. ఎలా అనుకుంటూ పాల..ఐస్ క్రీమ్ తో స్మూతీ చేసిఇవ్వొచ్చు. పాలు, పళ్లు రెండు ఒకేసారి పిల్లలకు, పెద్దలకు కూడా ఇలా ఇవ్వొచ్చన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం..మరియు ఇష్టంగాను తాగేస్తారు..మరీ మీరు తయారు చేయండి ఈ సింపుల్ అండ్ టేస్ట్ బనానా స్మూతీని..

Banana Ice Cream
కావల్సిన పదార్థాలు:
బనానా(అరటిపండ్లు): 2
ఆరెంజ్ జ్యూస్: 1/3cup
వెనీలా ఐస్ క్రీమ్(వెనీలా ఎక్స్ ట్రాక్ట్)
పాలు: 1cup
ఐస్ క్యూబ్స్: 2

తయారు చేయు విధానం:
1. ముందు అరటి పండ్లను మీడియం సైజులో కట్ చేసుకోవాలి.
2. తర్వాత అరటిపండు ముక్కలు, ఐస్ క్యూబ్స్, మరియు పాలు జ్యూసర్ లో వేసి బ్లెడ్ చేయాలి.
3. తర్వాత అందులోనే ఆరెంజ్ జ్యూస్, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి మరో సారి బ్లెడ్ చేయడం వల్ల ఇతి చాలా మెత్తగా మరియు చిక్కగా తయారువుతుంది.
4. అంతే జ్యూసర్ నుండి స్మూతీని సర్వింగ్ గ్లాసులో కూల్ కూల్ గా అంధించడమే ఆలస్యం..

English summary

Delicious Banana Ice Cream Smoothie! | కూల్...కూల్..బనానా ఐస్ క్రీమ్ స్మూతీ

Smoothies are refreshing drinks with different taste and flavour. Bananas are energetic fruit which boosts up the body metabolism instantly. Smoothies get a different look and taste if you add ice cream. Here is the recipe to make banana smoothie with ice cream and orange juice.
Story first published: Friday, May 3, 2013, 17:01 [IST]
Desktop Bottom Promotion