అత్యధిక పోషకాలతో దాల్ దోశ...!

Healthy..Protein Dal Dosa
దోశలను రకరకాల రుచిలతో చేసుకొని తింటుంటారు. అలాగే కొంచెం వెరైటీగా బియ్యం లేకుండానే, వట్టి పప్పులతోనే దోశను తయారు చేసి తినవచ్చు. ఇందులో వాడిన పప్పులన్నీ మాంసకృత్తుల్ని సమృద్దిగా అందిస్తాయి. మినపప్పు త్వరితగతిన శక్తినందిస్తుంది. శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. జీర్ణక్రియనూ వేగవంతం చేస్తుంది. సెనగపప్పు నుంచి మాంసకృత్తుల్ని పుష్కలంగా అందుతాయి. పెసరపప్పుతో పీచు పదార్థాన్ని పొందవచ్చు. ఈ పప్పులో కొవ్వుశాతం కూడా తక్కువ. క్యాల్షియం, విటమిన్లు, పొటాషియం ఇలా ఎన్నో పోషకాలను పెసరప్పు నుంచి పొందవచ్చు...

కావలసిన పదార్థాలు:
మినపప్పు: 1/2cup
పెసరపప్పు: 1/2cup
శెనగపప్పు: 1/2cup
అల్లం ముక్క: చిన్నది
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా పప్పులన్నీ శుభ్రం చేసుకొని రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి.
2. ఆ తర్వాత అల్లం, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని మొత్తగా రుబ్బుకోవాలి. (ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు
3. ఈ పిండిని అప్పటికప్పుడు పెనం మీద దోశల్లా వేసుకుంటే. చట్నీతో తినడమే ఆలస్యం. కొంచెం వెరైటీగా కావాలనుకొంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, కొత్తమీర తురుము వేసి బాగా కలియబెట్టి తర్వాత దోశెలా వేసుకోచ్చు.

Story first published: Tuesday, May 22, 2012, 12:37 [IST]
Desktop Bottom Promotion