హెల్తీ అండ్ టేస్టీ వెజ్ బర్గర్

Tasty Veg Burger
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ: 1(పెద్దది సన్నని చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 2(సన్నగా చక్రాల్లా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 3tbsp
బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ : 8
బట్టర్: 2tbsp
వెజ్ ఫ్యాటీస్ కోసం:
ఉడకబెట్టిన కూరగాయలు: 2cups(పొటాటో, క్యారెట్, బీన్స్, క్యాబేజీ)
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3tbsp
కొత్తిమీర తరుగు : 1/2cup
పచ్చిమిర్చి తరుగు: 2tbsp
ధనియాల పొడి: 1tsp
జీరా పౌడర్: 1/2tsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నిమ్మరసం: 1tsp
పుదీనా చట్నీ కోసం:
కొత్తిమీర: 1/2cup
పుదీనా: 1/2cup
పచ్చిమిర్చి: 2-3
ఉప్పు: రుచికి తగినంత
నిమ్మరసం: 1/2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఫ్యాటీస్ తయారి: ఉడకబెట్టిన కూరగాయలకి మిగిలిన పదార్థాలన్నీ కలిపి అరచేతి సైజులో అంగుళం మందంగా తయారు చేసుకోవాలి.
2. తర్వాత పాన్ మీద నూనె వేసి వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
3. అంతలోపు పుదీనా చట్నీకోసం ఇచ్చిన పదార్థాలన్నీ గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వాత బన్ లోపలి వైపు పుదీనా చట్నీ రాసి తయారు చేసుకున్న ఫ్యాటీసును అమర్చి దాని పైన ఉల్లి, టమోటో చక్రాలను పేర్చి బన్ ను మూయాలి.
5. చివరగా గ్రిల్, టోస్టర్ లేదా పెనం వేడి చేసుకుని బర్గర్ ను దాని మీద పెట్టి కొద్దిసేపు కాలనివ్వాలి. అంతే వెజ్ హెల్తీ బర్గర్ రెడీ...

Story first published: Monday, September 3, 2012, 18:19 [IST]
Desktop Bottom Promotion