For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎండ వేడికి గమ్మతించే మసాలా మజ్జిగ

|

Hot Summer-Cool Cool Masala Butter Milk
వేసవిలో ఎండలు...నడినెత్తిన మండే సూర్యుడు ప్రతాపం చూపించాడంటే రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్టే. ఒంట్లో సత్తువంతా స్ట్రా వేసుకొని ఎవరో పీల్చేసినట్టే..శ్రమతో కూడిన చుమటులు కమ్మేసినట్టే..ఎండనపిడి ఇంటికి రాగానే చల్లచల్లగా ఓ లస్సీ అందిస్తే ఏం మజాగా ఉంటుంది. అందులో బాగంగానే ఈ రుచికరమైన మసాలా మజ్జిగ మీకోసం........

కావలసిన పదార్థాలు:
పెరుగు: 1cup
చల్లని నీళ్ళు: 1cup
అల్లం తురుము: 1tsp
పచ్చిమిర్చి తురుము: 1tsp
కొత్తమీర తరుగు: 1tsp
వేయించిన జీలకర్ర: 1tsp
కరివేపాకు తరుగు: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
ఎండుమిర్చి: 1(మధ్యకు చీరాలి)

తయారు చేయు విధానం:
1. ముందుగా చల్లని నీళ్లు పోసి పెరుగును బాగా చిలకాలి. (మీక్సీలో వేసి చిలికితో రుచిలో తేడా వస్తుంది. చిక్కగా తయారవుతుంది)
2. తర్వాత అల్లం తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, నల్లమిరియాలు, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి.
3. అంతే మసాలా అంజి మోర్ రెడీ. సర్వ్ చేసే ముందు కొత్తిమీర, వేయించి క్రష్ చేసిన జీలకర్ర, ఎండుమిర్చితో గార్నిష్ చేయాలి.
పుదీనా, కొత్తిమీర, జీలకర్ర , మిరియాలు ఇందులో ఉపయోగించడం వల్ల కాలానుగుణంగా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు.

English summary

Hot Summer-Cool Cool Masala Butter Milk | ఎండ వేడికి గమ్మతించే మసాలా మజ్జిగ

Masala Buttermilk using this simple recipe from Awesome Cuisine. Anytime we want something cooling, a glass of chilled masala buttermilk is never far from hand.
Story first published:Monday, May 14, 2012, 10:00 [IST]
Desktop Bottom Promotion