Latest Updates
-
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వేడివేడి కప్పు కాఫీతో హెల్తీ ఈవెనింగ్ స్నాక్: మేతి పకోడా
వర్షాకాలంలో చల్లగాలికి, చలికి వేడి వేడిగా ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. దాంతో పాటు వేడి వేడి ఒక కప్పు కాఫీ ఉంటే ఆ మజాయే వేరు. అందుకు క్రిస్పీ పకోడాలు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. చాలా వరకూ మనం ఉల్లిపాయ పకోడా, ఆలూ పకోడా మరియు మరికొన్ని ఇతర పకోడాలు రుచి చూసే ఉంటాము అయితే మేతి పకోడా మనం ఎప్పుడు ట్రై చేసి ఉండం?
మేతీ పకోడా ఒక రుచికరమైన స్నాక్ రిసిపి. దీన్ని టీతో పాటు ఈవెనింగ్ స్నాక్ గా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ సీజన్ లో మెంతికూర మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మెంతికూర తీసుకొంచి కొన్ని మసాలా దినుసులు జోడించి హెల్తీ ఈవెనింగ్ స్నాక్ తయారుచేయడమే ఆలస్యం...

కావల్సిన పదార్థాలు:
మెంతి ఆకులు :3 cups (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అన్నం: 1cup
పచ్చిమిర్చి:2 (సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 (మీడియంసైజ్ , చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
హింగ్ (ఇంగువ) : చిటికెడు
కారం: 1tsp
శెనగపిండి: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా అన్నం, శెనగపిండి, మెంతిఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా అన్నింటిని మిక్స్ చేసుకోవాలి.
2. తర్వాత ఈ పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేస్తూనే కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా కలుపుకోవాలి.
3. తర్వాత పదార్థం నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా రౌండ్ చేసి పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి, నూనె వేసి కాగనివ్వాలి.
5. నూనె కాగిన తర్వాత అందులో మేతి బాల్స్ అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి.
6. ఇలా మొత్తం ఫ్రై చేసుకొన్నాక, సర్వింగ్ ప్లేట్లోనికి సర్ధి పుదీనా లేదా గార్లిక్ చట్నీతో సర్వ్ చేయాలి. అంతే మేతీ పకోడా రెడీ. వేడి వేడి కప్పు కాఫీతో ఈ హెల్తీ ఈవెనింగ్ స్నాక్ ను లాగించేసేయండి..



Click it and Unblock the Notifications











