Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
పొటాటో బజ్జీలు - స్పెషల్ ఈవెనింగ్ ట్రీట్
సాధారణంగా కొంత మంది పిల్లలకు మరియు పెద్దలకు కొన్ని వెజిటేబుల్స్ అంటే మహా ఇష్టం. అటువంటి వెజిటేబుల్స్ ఒకటి బంగాళదుంప. ఈ బంగాళదుంపతో తయారుచేసే వంటలంటే ఎవరూ నో చెప్పరు. పిల్లలు స్కూల్ నుండి, పెద్దలు, ఆఫీసులు, కాలేజీల నుండి ఇంటికి తిరిగి వచ్చిన వారికి మంచి మూడ్ కోసం ఏదైన ఒక మంచి స్నాక్స్ అందివ్వాలి. అటువంటి , మంచి స్నాక్స్ లో పొటాటో బజ్జీ ఒకటి.
పొటాటో జబ్జీలు తయారుచేయడం చాలా సులభం మరియు చాలా త్వరగా తయారవుతాయి. మీ కుటుంబ సభ్యులకు బంగాళదుంపలతో తయారుచేసే వంటలంటే ఎక్కువ ఇష్టం అయినప్పడు, ఈ రుచికరమైన టేస్టీ స్నాక్ ను తయారుచేసి అంధించండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

శనగ పిండి - 1 ½cup
నీరు - 1cup
కారం - 1tsp
గరం మసాల పొడి - 1 చిటికెడు
బేకింగ్ సోడా - చిటికెడు
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- ప్రై చేయడానికి సరిపడా
ఇంగువ : ½tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పీలర్ ఉపయోగించి బంగాళదుంప మీద పొట్టు తొలగించాలి. పొట్టు తొలగించిన తర్వాత , వాటినిలో ఉప్పు నీటిలో వేసి 15నానవివ్వాలి.
2. 15నిముషాల తర్వాత నీరు వంపేసి, వాటిని స్లైస్ గా కట్ చేసుకోవాలి. గుండ్రంగా చాలా పల్చగా చేసుకోవాలి.
3. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో శెనగపిండి, కారం, గరం మసాలా, బేకింగ్ సోడ, చిటికెడు ఇంగువ, మరియు ఉప్పు వేసి, ఈ పదార్థాలన్నింటిని, కొదానితో ఒకటి బాగా కలిసేలా కలుపుకోవాలి.
4. అందులోనే, కొద్దిగా నీల్ళు కూడా వేసి చేత్తో బాగా కలుపుకోవాలి.
5.శెనగపిండి, ఉండలు కట్టకుండా చాలా సున్నితంగా చేత్తో కలుపుకోవాలి.
6. ఇలా కొద్దిగా చిక్కగా, కొద్దిగా జారుడుగా కలుపుకొన్నతర్వాత అందులో స్లైస్ గా కట్ చేసి పెట్టుకొన్ని బంగాళదుంప స్లైస్ కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. బంగాళదుంప స్లైస్ మొత్తం పిండిలో బాగా కలిసిపోయి, కోటింగ్ లో అంటుకొనేలో మిక్స్ చేయాలి.
7. తర్వాత పాన్ తీసుకొని, అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, మీడియం మంట మీద వేడిచేయాలి.
8. నూనె వేడెక్కగానే అందులో శెనగపిండిలో డిప్ చేసిన బంగాళదుంపస్లైస్ ను వేయాలి.
9. వేడినూనెలో ఇటుఅటూ తిప్పుతూ బంగాళాదుంపలను బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
10. బ్రౌన్ కలర్ లోకి మారగానే, బంగాళదుంపల బజ్జీలను ఒక సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. వాటిని మీద బ్లోటింగ్ పేపర్ పరవడం వల్ల నూనెను పీల్చుకుంటుంది. అంతే, తినడానికి పొటాటో బజ్జీ రెడీ. ఈ ఈవెనింగ్ స్నాక్ ను టమోటో సాస్ లేదా చిల్లీ సాస్ తో తినివచ్చు.



Click it and Unblock the Notifications











