Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
స్పైసీ రాగి రొట్టె తో బ్రెక్ ఫాస్ట్ మజా..

స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి రాగులు బాగా తోడ్పడుతుంది. ఇన్ని విధాలుగా ఆరోగ్యానికి తోడ్పడే రాగులతో రకరకాల తినుబండారాలను తయారు చేసుకోవచ్చు. ఇవి చేయడం కూడా సులభం. పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 2cups
ఉల్లిపాయలు: 1cups(చిన్నగా కట్ చేసినవి)
కొత్తిమీర: 1/2cups(చిన్నగా కట్ చేసినవి)
కరివేపాకు: రెండు రెమ్మలు
పచ్చిమిర్చి: 4-5
జీలకర్ర: 1tsp
పచ్చికొబ్బరి తురుము: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
అల్లం తరుము: 1tsp
నీళ్ళు: పిండికలుపుకోవాడానికి కావలసినంత
తయారు చేయు విధానము:
1. ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి వేసుకోవాలి.
2. తర్వాత అందులో ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమిర, కరివేపాకు తరుగువేయాలి.
3. అందులోనే పచ్చికొబ్బరి తురుము, అల్లం తురుము వేసి కొద్దిగా వేడినీటితో మిశ్రమం అంతా సమంగా కలిసేటట్లు కలుపుకోవాలి. (పిండి జారుగా కాకుండా ముద్దగా కలపాలి).
4. ఇప్పుడు రాగి రొట్టెకు పిండి తయారైంది. తర్వాత పెనం పై కొద్దిగా నూనె రాగి పిండిని కొద్దిగా తీసుకొని పెనం పై తట్టాలి.
5. రొట్టెపై కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఎర్రగా కాల్చాలి. తర్వాత రెండవ వైపు తిప్పి ఎర్రగా కాల్చి ప్లేట్ లో తీసుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే రాగి రొట్టె రెడీ. ఈ రొట్టె ఉల్లిపాయ పచ్చడి / ఎర్రకారంతో తింటే చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications











