For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తున ఫిష్ కట్ లెట్ : టేస్టీ అండ్ హెల్తీ

|

చేప, ఉల్లిపాయలు, అల్లం, లవంగము, వెల్లుల్లి, కొత్తిమిర, కారం, ఉప్పు, గరం మసాలా, బ్రెడ్ పొడి, గ్రుడ్లు, పొటాటో, పచ్చి బటానీలు,

మాంసాహార ప్రియులకు చేపలంటే కూడా చాలా ఇష్టం. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ఉండే వారు చేపలతో వివిధ రకాలుగా వెరైటీ వెరైటీ ఫిష్ వంటకాలను తయారు చేస్తుంటారు. చేపలు ఏవిధంగా వండినా సూపర్ టేస్ట్ ఉంటుంది. చేపలను కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కట్ లెట్, ఫిష్ స్నాక్స్ మొ...

చేపలు తినండి ఆరోగ్యాన్ని..ఆయుష్యును పెంచుకోండి

మీ ఆరోగ్యం కోసం ఏరకమైన చేపలైనా సరే ఎంపిక చేసుకోండి. ఎందుకంటే చేపలన్నింటిలోనూ ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్ అధికంగా ఉండి ఆరోగ్యానికి అత్యధిక ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. వివిధ రకాల చేపల్లో తున ఫిష్ చాలా టేస్ట్ గా ..ఆరోగ్యకరమైనది.

మాంసాహారులకు ఒక కొత్త రుచిని ఆస్వాధించాలంటే..పిల్లలు కూడా ఇష్టంగా తినలాంటే తున ఫిష్ కట్ లెట్ ట్రై చేయండి. చేపల కూర, ఫ్రైలతో సరిపెట్టుకోకుండా ఈవెనింగ్ టైమ్ స్నాక్స్ గా కూడా ఫిష్ కట్ లెట్ ట్రై చేయవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా సులభమే. మరి మీరు కూడా ఒక సారి ప్రయత్నించి, రుచి చూడండి...

Tuna Fish Cutlets: Tasty and Healthy

కావల్సిన పదార్థాలు:

తున ఫిష్- 2 small tins
ఉల్లిపాయలు- 2పెద్దవి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి- 5 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కరివేపాకు- 3 రెమ్మలు(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం - 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి: - 1tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కారం- ½ tsp
పసుపు- ¼ tsp
మిరియాలపొడి- ½ tsp
గరం మసాలా- ½ tsp
నూనె- 2tbsp (వేడిచేయాలి)
గుడ్లు- 1-2 (బాగా గిలకొట్టాలి)
బంగాళదుంప- 1 (చిన్నసైజు, ఉడికించి మ్యాస్ చేసుకోవాలి)
బ్రెడ్ పొడి: కోటింగ్ కోసం
డీప్ ఫ్రై చేయడానికి : నూనె
గరం మసాలా పొడి కోసం:
లవంగాలు- 2tbsp
యాలకలు- 2tbsp
యానీసీడ్- 2tbsp
దాల్చిన చెక్క- 3 small sticks

బట్టర్ (వెన్న)గార్లిక్ ఫిష్ ఫ్రై రిసిపి

తయారుచేయు విధానం:
1. ముందుగా గరం మసాలా కోసం సిద్దం చేసుకొన్న వాటినన్నింటిని డ్రై రోస్ట్ చేసుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
2. తర్వాత చేపలను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా వంపేసి, తడి ఆరేవరకూ పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నని ముక్కలుగా చేయాలి. లేదా ముల్లు తొలగించి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు రెండు చెచాల నూనెను పాన్ లో పోసి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మరియు కరివేపాకు వేసి రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై రుచి అమోఘం..
4. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. అందులోనే పసుపు, కారం, పెప్పర్ పౌడర్, మరియు గరం మసాలా వేసి మరో 3 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. అలాగే రుచికి సరిపడా ఉప్ప వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే మెత్తగా చేసి పెట్టుకొన్ని చేపపదార్థాన్ని వేసి మొత్త మిశ్రమాన్ని కలగలుపుతూ తేమ లేకుండా ఫ్రై చేయాలి.
8. ఇలా చేసిన తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దుంపుకొని, చల్లారనివ్వాలి.
9. ఇవి చల్లారిన తర్వాత వీటిని రౌండ్ షేప్ లో అరచేతిలో పెట్టుకొని వడలా తట్టుకోవాలి.

చేప నూనెతో లాభనష్టాలు తెలుసుకోండి..!
10. ఇలా ప్రిపేర్ చేసి కట్ లెట్ ను బాగా గిలకొట్టి పెట్టుకొన్న ఎగ్ లో డిప్ చేసి ప్లేట్ లో ఉన్న బ్రెడ్ పొడిలో వేసి ప్లొరించాలి. అన్నివైపులు బ్రెడ్ పొడి అంటుకొనేలా చేయలి.
11. ఇప్పుడు డీఫ్ ఫ్రైకి సరిపడా నూనె పాన్ లో వేసి వేడి చేయాలి . వేడి అయ్యాక ఆ నూనెలో రెడీగా పెట్టుకొన్న ఫిష్ కట్ లెట్ వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
12. అంతే ఫిష్ కట్ లెట్ రెడీ. దీన్ని వేడి వేడి ఆనియన్ సలాడ్ /మింట్ /టామరిండ్ చట్నీతో సర్వ్ చేయాలి.

Story first published:Monday, January 11, 2016, 17:54 [IST]
Desktop Bottom Promotion