For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటుకుల పాయసం: శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్

|

శ్రీక్రిష్ణ జన్మాష్టమి లేదా లార్డ్ క్రిష్ణ బర్త్ డే మరో రెండు, మూడు రోజుల్లో రాబోతున్నది . మరి ఈ శ్రీక్రిష్ణ జన్మాష్టమి మీరు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే, పాత వంటకాలనే ఈ సంవత్సరం కూడా ప్రయత్నించకుండా, ఒక కొత్త రిసిపిలను ప్రయత్నించి, శ్రీక్రిష్ణ జన్మాష్టమి పండుగ వాతావరణంను మరింత గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకోండి . శ్రీక్రిష్ణునికి పాలతో తయారుచేసే ఏవంటలైనా సరే మహా ఇష్టం. అలాగే పాలతో తయారుచేసే స్వీట్స్ కూడా ఇష్టమే.

వినాయకుడికైనా కుడుమిస్తే పండగేమో గానీ...శ్రీకృష్ణుడు అంతకంటే భక్తసులభుడు. విదురుడు పండుకు బదులు తొక్క ఇచ్చినా...
అటుకులు చాలుననే కీలకాన్ని కుచేలుడు కనిపెట్టినా... ఆయన అంతగా పట్టించుకోలేదు. అంతమాత్రాన కన్నయ్యని తిన్నగానే డీల్ చేయవచ్చంటూ
మనమూ వాళ్లంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సరిపెట్టుకోలేం కదా! మంట తప్ప వంట పెద్దగా అక్కర్లేదని ‘రా'ఫుడ్డు పాలూ, వెన్నలను మాత్రమే నివేదించలేం కదా! జన్మాష్టమి రోజున వెన్నదొంగను వశం చేసుకోవడానికి, ఆయన ప్రసాద మంటూ మనం ఆరగించడానికి కృష్ణుడిష్టపడే టేస్టుకు తగిన డిష్ ఇది.
నైవేద్యంగా పెట్టి ఆయన విషెస్ అందుకోండి.

Yummy Aval Payasam For Janmashtami Spl Recipe

కావలసిన పదార్థలు:
పాలు: 1/2ltr
వెన్న : 50grm
అటుకులు : 100grm
జీడిపప్పు : 10grm
కిస్‌మిస్ : 10grm
బాదం పప్పు : 10grm
ఏలకుల పొడి : 1tsp
కొబ్బరి తురుము : 1cup
బెల్లం తురుము : 1/2kg

తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి.
2. తరవాత అందులో బెల్లం తురుము వేసి బాగా కలిసిన తరవాత అందులో అటుకులు వేసి సుమారు పావుగంట సేపు ఉడికించాలి.
3. అంతలోపు చిన్న పాన్ లో నెయ్యి వేసి కరిగిన తరవాత అందులో జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పు వేసి వేయించి ఉడుకుతున్న పాయసంలో వేసి ఒక నిముషం ఉంచి దించే ముందు ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే జన్మాష్టమి స్పెషల్ అటుకుల పాయం రెడీ.

English summary

Yummy Aval Payasam For Janmashtami Spl Recipe

Generally aval payasam is made for Gokulashtami Aval Payasam is a very traditional flattened rice pudding that is made during Gokulashtami or Janmashtami Krishna Jayanthi. This payasam is made from aval also known as poha or flattened rice and is prepared in very little time. It makes a perfect dessert for the times when you are unprepared as well.
Story first published: Thursday, August 14, 2014, 12:30 [IST]
Desktop Bottom Promotion