Latest Updates
-
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష!
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
ఇడ్లీ, దోసెల్లోకి రోజూ చేసుకునే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, లేదా టమోటా పచ్చడి తిని తిని మీ ఇంట్లో వాళ్ళకు బోర్ కొట్టిందా? అయితే సొరకాయతో కొబ్బరి చట్నీకే గట్టి పోటీ ఇచ్చే అద్భుతమైన పచ్చడిని తయారుచేసుకోవచ్చు.
అద్భుతమైన రుచులకు కేరాఫ్ అడ్రస్ అయిన చెట్టినాడ్ ప్రాంతంలో సొరకాయ పచ్చడి ఎంతో ఫేమస్. ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడ, అన్నం.. ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. సొరకాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి, ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
సొరకాయ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
సొరకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
పల్లీలు (వేరుశెనగ గుళ్ళు)- అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
కొత్తిమీర - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
పచ్చిమిర్చి - 3
వెల్లుల్లి రెబ్బలు - 5
బెల్లం - 1 టీస్పూన్
చింతపండు - చిన్న ఉసిరికాయంత
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
తాలింపుకి నూనె - అర టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - 1 రెమ్మ
సొరకాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేడి చేశాక అందులో పల్లీలు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి దోరగా, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పుల రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మరో స్పూన్ నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి మీడియం మంట మీద పచ్చివాసన పోయేలా కాసేపు వేయించి, వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి.
-అదే పాన్ లో మిగిలిన నూనె వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. ముక్కలలోని పచ్చిదనం (ఆకుపచ్చ రంగు) పోయి, అందులోని నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు వేయించాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులోనే వేయించిన మిరపకాయలు, సొరకాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీరు పోస్తూ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-చివరిగా తాలింపు కోసం చిన్న కడాయిలో అర టీస్పూన్ నూనె వేడి చేసి.. ఆవాలు వేసి చిటపటలాడనిచ్చాక అందులో మినపప్పు వేసి గోధుమ రంగులోకి వచ్చాక, ఎండు మిర్చి, కరివేపాకు వేసి రెండు సెకన్ల పాటు వేయించాలి. ఈ తాలింపును రుబ్బి పెట్టుకున్న గుమ్మడికాయ చట్నీపై పోసి బాగా కలుపుకోవాలి. అంతే సొరకాయ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









