Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
రెడ్ లెంటిల్- కోకోనట్ మిల్క్ సూప్: వింటర్ స్పెషల్
Soups Snacks Drinks
oi-Saraswathi
By Sindhu
వింటర్ సీజన్ లభ్యం అయ్యే తాజా పండ్లు, గ్రీన్ లీఫ్ వెజిటేబ్స్ లో మంచి ఆరోగ్యాన్ని పొందడం మాత్రమే కాదు, పప్పుధాన్యాలతో కూడా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. శీతాకాలంలో సాయంత్రం అయ్యే సరికి వాతావరణం చాలా చల్లగా మారుతుంది. చలికి వేడి వేడిగా ఏదైనా త్రాగాలి, తినాలనిపిస్తుంది. అటువంటి, అనారోగ్యకరమైన కాఫీ, టీ, కెఫినేటెడ్ డ్రింక్స్ కంటే, సూపులను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
అందులోనూ పప్పులతో తయారుచేసే సూపులు, శరీరానికి పూర్తి పోషకాలను అంధించి,ఆరోగ్యంగా ఉంచుతుంది. వింటర్ వెజిటేబుల్స్ కు కొద్దిగా పప్పులు జోడించి సూప్ ఎలా తయారుచేయాలో క్రింది పద్దతిన అనుసరించండి...

రెడ్ లెంటిల్ /ఎర్రకందిపప్పు: 1cup
ఆలివ్ నూనె: 3tbsp
వెల్లుల్లి రెబ్బలు: 2-3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జలపెన్యో పెప్పర్: 2 (సన్నగా కట్ చేసునవి)
క్యారెట్ ½ కప్ (తరిగినవి)
పచ్చిబఠానీ: ½cup
టమోటా హిప్ పురీ: ½ cup
ఉప్పు : రుచికి సరిపడా
పసుపు: ½tsp
కారం ½ tsp(సరిపడా)
నిమ్మకాయ రసం : 2tbsp
కొబ్బరి పాలు - 1cup
తయారుచేయు విధానం :
1. ముందుగా మందపాటి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి, వేడి చేయాలి.
2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు పెప్పర్ వేసి ఒక నిముషం వేయించుకోవాలి.
4. తర్వాత అందులో క్యారెట్, పచ్చిబఠానీ, ఎర్రకందిపప్పు, టమోటో గుజ్జు, ఉప్పు, కారం మరియు పసుపు వేయాలి.
5. తర్వాత అందులో 6కప్పుల నీరు పోసి మూత పెట్టి పప్పు మెత్తగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
6. చివరిగా అందులో కొబ్బరి పాలు మరియు నిమ్మరసం వేసిబాగా మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: red lentils olive oil garlic carrot green peas tomato ఎర్రకందిపప్పు ఆలివ్ ఆయిల్ వెల్లుల్లి ఉల్లిపాయ క్యారెట్ పచ్చిబఠానీ టమోటో
English summary
Red Lentil Soup With Coconut Milk
Story first published: Monday, January 6, 2014, 16:13 [IST]
Other articles published on Jan 6, 2014



Click it and Unblock the Notifications











