Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చెట్టినాడు స్టైల్ పన్నీర్ కర్రీ..బగారా రైస్, జీరా రైస్ లోకి సూపర్ హిట్..నాన్ వెజ్ ప్రియులు ఫిదా అవ్వాల్సిందే
భారతీయ వంటకాల్లో దక్షిణాది వంటకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ తమిళనాడుకు చెందిన చెట్టినాడు వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. చెట్టినాడు వంటలు అనగానే మనకు గుర్తొచ్చేది ఘాటైన మసాలాలు, అద్భుతమైన సువాసనలు, తాజా మసాలా దినుసుల రుచి.
సాధారణంగా చెట్టినాడు స్టైల్ లో చికెన్ లేదా మటన్ వండుతారు, కానీ శాఖాహారుల కోసం అదే రుచితో, అంతే ఘాటుతో చేసుకునే అద్భుతమైన వంటకం చెట్టినాడు పన్నీర్ కర్రీ. చెట్టినాడు స్టైల్ పన్నీర్ కర్రీ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పన్నీర్
-ధనియాలు
-జీలకర్ర
-టమాటో
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-సోంపు
-నూనె
-నెయ్యి
-జీడిపప్పు
-రాతి పువ్వు
-జాపత్రి
-యాలకలు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-మరాఠీ మొగ్గ
-అనాస పువ్వు
-ఉల్లిపాయలు
-కరివేపాకు
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా చెట్టినాడు మసాలా చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా రాతిపువ్వు, 3 ఎండుమిరపకాయలు, 3 లవంగాలు, 2 యాలకలు, 2 చిన్న అనాస పువ్వులు,2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒకటిన్నర ఇంచు దాల్చిన చెక్క, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాలు, అర టేబుల్ స్పూన్ సోంపు, ఒక మరాఠీ మొగ్గ, చిన్న జాపత్రి ముక్క వేసి సన్నని సెగ మీద మసాలా దినుసులు మంచి సువాసన వచ్చేదాకా వేయించి స్టవ్ ఆపేయాలి.
-మసాలాలు ఎక్కువగా వేయించకూడదు. మసాలాలు లైట్ గా వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి పైపైన చిట్లనిచ్చి స్టవ్ ఆపేయాలి.
-వేయించినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకొని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, రెండు టమాటోల పెద్ద ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యాలి. వేడిక్కెన నూనెలో చిటికెడు జీలకర్ర వేసి చిట్టనిచ్చాక అందులో అరకప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 1 రెబ్బ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి.
-ఉల్లిపాయలు లేత బంగారు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేపాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి.
-టమాటో మిశ్రమం బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి పైపైన కలిపాక అందులో గ్రైండ్ చేసుకున్న చెట్టినాడ్ మసాలా వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలనివ్వాలి. మసాలాలు ఎక్కువ వేగినా చేదు వస్తుంది.
-గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆపేయాలి. అంతే చెట్టినాడ్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








