Latest Updates
-
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.!
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.!
శ్రావణ మాసం అంటేనే స్వీట్లు స్పెషల్. హిందూ సంప్రదాయంలో అమ్మవారికి నైవేద్యంగా వివిధ రకాల తీపి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తారు. అలాంటి స్వీట్లలో బూరెలు చాలా స్పెషల్. ఈ మాసంలో ఒక్కసారైనా అమ్మవారికి బెల్లం బూరెలను నైవేద్యంగా పెడతారు. ఈ బెల్లం బూరెల్లో కొద్దిగా కొబ్బరి యాడ్ చేసి చేశారంటే పండుగ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇంటిల్లిపాదీ ఈ కొబ్బరి బూరెల రుచికి మైమరిచిపోవాల్సిందే..

కొబ్బరి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు..
బియ్యం- ఒక కేజీ(బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నుంచి 16 గంటల పాటు
నానబెట్టాలి)
తాజా కొబ్బరి- ఒకటి
బెల్లం- 650 గ్రాములు
నెయ్యి- రెండు టీ స్పూన్లు
ఏలకుల పొడి- టీస్పూన్
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
నానబెట్టిన బియ్యంలో నీటిని మొత్తం తీసేసి ఎక్స్‌ట్రా వరకు పోయేవరకు జల్లెడలో పోయాలి. దానిపై మూత పెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని దానిపై బియ్యాన్ని పరిచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి.
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.!
తర్వాత కాస్త తడిపొడిగా ఉన్న బియ్యాన్ని తీసుకుని మిక్సీ బౌల్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి. బరకగా ఉన్న పిండి పోయి మెత్తటి పిండిని తీసుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా అరచేతులతో ఒత్తి మూతపెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని పగలగొట్టి కొబ్బరి ముక్కలను కట్ చేసుకోవాలి. దాదాపు ఇవి రెండు కప్పులు ఉండాలి. వీటిని మిక్సీ బౌల్‌లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

తర్వాత స్టవ్‌పై ఒక బౌల్ పెట్టుకుని అందులో బెల్లం వేసి పావు కప్పు నీళ్లు పోసి కరిగేవరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్ పక్కన పెట్టుకుని మరో మందపాటి పొడవైన బాణలి స్టవ్‌పైన పెట్టుకుని అందులో ఈ బెల్లం పానకాన్ని వడగట్టి పోసుకోవాలి.
ఈ బెల్లం పానకాన్ని కరిగించుకోవాలి. మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా పానకం మరిగించుకోవాలి. చేతితో తీసుకుని పానకం సరిగా వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్దను వేసి కలుపుతూ ఉండాలి. టీస్పూన్ నెయ్యి, టీస్పూన్ ఏలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ బాణలిని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇందులో బియ్యంపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా స్మూత్‌గా కలుపుకోవాలి. చివరిగా మిగిలిన నెయ్యి వేసి మూతపెట్టి దాదాపు పది నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పిండి కాస్త చల్లబడుతుంది.
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.!
స్టవ్‌పైన కడాయి పెట్టుకుని వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగనివ్వాలి.
తడిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని అరిసెల మాదిరిగా ఒత్తుకుని నూనెలో వేసుకోవాలి. నూనెలో వేయగానే పూరీల మాదిరిగా పొంగుతుంటాయి. రెండు వైపులా కాలుతూ రంగు మారి మంచి సువాసన వస్తుంటాయి.
బూరెలు కాలిన తర్వాత వీటన్నిటినీ జల్లెడలో వేసుకోవాలి. దీంతో వాటిలో ఉన్న ఎక్స్‌ట్రా ఆయిల్ వేరే గిన్నెలోకి వెళ్లిపోతుంది.
తర్వాత వీటిని మరో బౌల్‌లోకి తీసుకుని. అంతే రుచికరమైన కొబ్బరి బూరెలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
