మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేసుకోండి,అద్భుతమైన రుచి

Posted By:

ఎండాకాలం వచ్చేసింది. కొన్ని చోట్ల మామిడిచెట్లకు ఇంకా పూతనే ఉండగా..మరికొన్ని చోట్ల కాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. మార్కెట్ లోకి కూడా పచ్చిమామిడి కాయలు వచ్చేశాయి. అయితే పచ్చి మామిడికాయ, కొబ్బరి కలయికతో చేసే పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నం, ఇడ్లీ, దోశ వంటి వాటితో చాలా బాగుంటుంది. మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

పచ్చిమామిడికాయ కొబ్బరి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు

పచ్చి మామిడికాయలు - 2 (మధ్యస్థంగా పుల్లగా ఉండేవి)
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
పచ్చిమిర్చి - 6-8
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా

మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారీ విధానం

-మామిడికాయలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి.

-ఇప్పుడు కొబ్బరిని తురుముకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి.

-పచ్చిమిర్చిని వేసి కొద్దిగా వేయించాలి.

-పచ్చిమిర్చి కొద్దిగా వేగాక, జీలకర్ర వేసి వేయించాలి.

-తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి, కొద్దిగా వేయించాలి. కొబ్బరిని ఎక్కువసేపు వేయించకూడదు.

టేస్ట్ లో ది బెస్ట్..పుదీనా పులావ్ ఇలా చేసుకుంటే మెతుకు మిగల్చకుండా నాకేస్తారు

-ఇప్పుడు మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

-మామిడికాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.

-స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

-చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి.

-ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.

-ఈ పోపును పచ్చడిలో వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే మామిడికాయ కొబ్బరి చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, March 5, 2025, 10:45 [IST]
Desktop Bottom Promotion