Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నోట్లో వెన్నలా కరిగిపోయే టమాటో పరాటా..ఆయిల్ కూడా అక్కర్లేదు..ఎలా చేసుకోవాలంటే
మీరెప్పుడనా టమాటో పరాటా తిన్నారా?రెగ్యులర్ గా తినే చపాతీలు, పరాటాలకు బదులు ఇది ఓ సారి ట్రై చేయండి. టమాటో పరాటా చాలా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా బోలెడు మేలు చేస్తుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లోకి లేదా మధ్యాహ్న భోజనానికి ఇది ఒక మంచి ఎంపిక. టమాటాలు, గోధుమ పిండిని ఉపయోగించి తయారుచేసే ఈ పరాటాలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని తయారుచేయడం కూడా చాలా సులభం. టమాటో పరాటాని మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
టమాటో పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి
-అల్లం
-పచ్చిమిరపకాయ
-సోంపు
-టమాటో
-గోధుమ పిండి
-వాము
-కొత్తిమీర
టమాటో పరాటా తయారీ విధానం
-ముందుగా మిక్సీలో 2 టమాటోల పెద్ద ముక్కలు,2 పచ్చి మిరపకాయల తురుము,అర ఇంచు అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ సోంపు వేసి నీళ్లు పోయకుండానే మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-మెత్తగా పేస్ట్ చేసిన టమాటో మిశ్రమాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, రెండు చిటికెళ్ల వాము నలిపి వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి.
-ఇప్పుడు టమాటో మిశ్రమంలో ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసి 4-5 నిమిషాలు బాగా వత్తుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ నూనె కూడా వేసి బాగా వత్తుకోండి. తర్వాత తడిగుడ్డ కప్పి 10 నిమిషాలు వదిలేయండి.
-తర్వాత ఈ పిండి ముద్ద మీద కొంచెం పొడి పిండి చల్లుకోండి. ఇప్పుడు కలిపిన పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని పారాటాలుగా వత్తుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దానిమీద వత్తుకున్న పరాటాలను ఒక్కొక్కటిగా వేసి 1 టీస్పూన్ ఆయిల్ వేస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంటే టమాటో పరాటా రెడీ. దీంట్లో నంజుకొని తినడానికి ఏ కూర కూడా అక్కర్లేదు. పెరుగుతో కలిపి తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







