Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆమ్లెట్ రోల్స్ కర్రీ..ఇంతటి టేస్టీది ఎప్పుడూ తినుండరు..ఎలా చేసుకోవాలంటే
ఆమ్లెట్ రోల్స్ కర్రీ అనేది ఒక విభిన్నమైన, రుచికరమైన వంటకం. ఇది సాధారణంగా చేసే గుడ్డు కర్రీ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని అన్నం, చపాతీ లేదా రోటీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఆమ్లెట్ రోల్స్ ను మసాలా గ్రేవీలో ఉడికించడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది. దీనిని మీరెప్పుడూ ట్రై చేసి ఉండకపోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చేప్తే జన్మలో వదలరు. ఇది కుటుంబ సభ్యులందరికీ చాలా నచ్చుతుంది. కొత్త రకమైన వంటకాలను ప్రయత్నించాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. దీనిని తయారుచేయడం కూడా చాలా సింపుల్. మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే దీనిని తయారుచేసుకోవచ్చు. ఆమ్లెట్ రోల్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఆమ్లెట్ రోల్స్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆమ్లెట్
-పచ్చి కొబ్బరి
-నీళ్లు
-సోంపు
-అల్లం తరుగు
-యాలకలు
-దాల్చిన చెక్క
-వెల్లుల్లి
-కరివేపాకు
-కొత్తిమీర
-మిరియాలు
-ఉల్లిపాయలు
-టమాటోలు
-జీలకర్ర పొడి
-కారం
-ధనియాల పొడి
-పసుపు
-సోంపు పొడి
ఆమ్లెట్ రోల్స్ కర్రీ తయారీ విధానం
-ముందుగా గ్రేవీ తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో 2 యాలకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 మిరియాలు, 3 లవంగ మొగ్గలు వేసి పొంగించండి.
-తర్వాత అందులో పావు టీస్పూన్ సోంపు వేసి పొంగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 6 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త ఎర్రబడేదాకా వేపుకోవాలి.
-తర్వాత అందులో అరకప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 1రెబ్బ కరివేపాకు వేసి ఉల్లి లేత గులాబీ రంగులోకి మారేదాకా వేగించాక 2 పెద్ద టమాటోల చీలికలు, 2 పచ్చిమిర్చి చీలికలు,రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటో ముక్కలు మెత్తబడేదాకా మగ్గించాలి.
-టమాటోలు మొత్తబడి పూర్తిగా గుజ్జు అయిన తర్వాత అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు వేసి వేయించాలి.
-తర్వాత అందులో రెండున్నర కప్పుల సెకండ్ ఎక్స్ ట్రాక్ట్ కొబ్బరి పాలు(ముందుగా పచ్చికొబ్బరి,కొన్ని నీళ్లు మిక్సీలో వేసి గ్రైండ్ చేశాక వచ్చే పిప్పిలో కాసిని నీళ్లు పోసి తీస్తే వచ్చే వాటిని సెకండ్ ఎక్స్ ట్రాక్ట్ కొబ్బరి పాలు అంటారు) పోసి బాగా కలిపి 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి.
-గ్రేవీ ఉడికి దగ్గరపడుతున్నప్పుడు అందులో పావు టీస్పూన్ సోంపు పొడి, కొత్తిమీర తరుగు చల్లుకొని మరో 3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు చిక్కని కొబ్బరి పాలు అందులో పోసి కలిపి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు రెండు ఆమ్లెట్స్ తయారుచేసుకోండి.
-రెడీ అయిన ఆమ్లెట్స్ ను రోల్ లా పెట్టి పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను పక్కన ఉంచుకున్న వేడి వేడి గ్రేవీలో వేసి 10 నిమిషాలు వదిలేయండి. అంతే ఆమ్లెట్ రోల్స్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







