వంకాయ పెరుగు పులుసు..వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే

Posted By:

వంకాయ పెరుగు పులుసు అనేది ఆంధ్ర వంటకాలలో ఒక ప్రత్యేకమైన, సంప్రదాయబద్ధమైన వంటకం. ఇది రుచిలో పుల్లగా, కారంగా, కొద్దిగా తీయగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పులుసుతో తింటే ఆ రుచి అమోఘం. చాలా సులభంగా తయారుచేయగలిగే ఈ వంటకం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వంకాయ పెరుగు పులుసు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

వంకాయ పెరుగు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు

-శెనగపప్పు
-మినపప్పు
-జీలకర్ర
-ఆవాలు
-పచ్చిమిర్చి
-పెరుగు
-ఆయిల్
-కొత్తిమీర
-చింతపండు
-ఉప్పు
-కారం
-పసుపు
-ఉల్లిపాయ

Super tasty vankaya perugu pulusu recipe in telugu

వంకాయ పెరుగు పులుసు తయారీ విదానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక ఇందులో 1 టేబుల్ స్పూన్ శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి.

-ఇప్పుడు అందులో 1 పెద్ద ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి వేయించాలి.

-ఉల్లిపాయలు కొంచెం వేగాక అందులో అర టీస్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోండి.

-తర్వాత అందులో అరకేజీ బ్లూ వంకాయల చీలికలను వేసి మూతపెట్టి మీడియం మంట మీద 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి.

-తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం వేసి బాగా కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద వంకాయలను పూర్తిగా మగ్గనివ్వాలి.

-ఇప్పుడు ఓ గిన్నెలో 400ml పెరుగు వేసి ఇందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి తీసిన రసం పోసి బాగా కలుపుకోండి.

-తర్వాత బాగా మగ్గిన వంకాయల్లో పెరుగు,చింతపండు మిశ్రమం పోసి మూతపెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి.

-ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వంకాయ పెరుగు పులుసు రెడీ.

కొన్ని ప్రయోజనాలు
వంకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) మన ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతాయి. ఈ రెండింటి కలయిక జీర్ణ సంబంధిత సమస్యలకు ఒక మంచి పరిష్కారం.

కొంతమందికి వంకాయ తింటే దురద, అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివారు ఈ వంటకాన్ని తీసుకోకపోవడం మంచిది. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా వంకాయను తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు.

[ of 5 - Users]
Story first published: Friday, August 22, 2025, 8:21 [IST]
Desktop Bottom Promotion