Latest Updates
-
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.!
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు!
తీపి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే అద్భుతమైన స్వీట్లలో మలై బర్ఫీ ఒకటి. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ కమ్మని స్వీట్, పండుగలు, శుభకార్యాలు, పుట్టినరోజులు లేదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వడ్డించడానికి బెస్ట్ ఆప్షన్.
బయట స్వీట్ షాపుల్లో కొనే పనిలేకుండా, ఎంతో స్వచ్ఛంగా, అదే రుచితో మన ఇంట్లోనే చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు కూడా ఈ పర్ఫెక్ట్ మలై బర్ఫీని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మలై బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు
చిక్కటి పాలు (ఫుల్ క్రీమ్ మిల్క్) - 1 లీటరు
పాలపొడి (మిల్క్ పౌడర్) - 1 కప్పు
పంచదార - అర కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీ స్పూన్
బాదం పప్పులు - 8 నుండి 10
పిస్తా పప్పులు - 8 నుండి 10
కుంకుమపువ్వు రేకులు - కొద్దిగా
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా!
మలై బర్ఫీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి అడుగున్న గిన్నె లేదా నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. అందులో లీటరు చిక్కటి పాలను పోసి మీడియం మంట మీద మరిగించండి. పాలు అడుగున మాడిపోకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి.
-పాలు బాగా మరిగి సగానికి తగ్గిన తర్వాత మంట తగ్గించి అందులో పాలపొడిని వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి.
-మంటను సిమ్ లో పెట్టి, మిశ్రమం దగ్గరపడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇది కాస్త కోవా లేదా హల్వా మిశ్రమంలా చిక్కబడ్డాక చక్కెర వేయాలి. చక్కెర కరిగాక మిశ్రమం కొద్దిగా పల్చబడుతుంది. కాబట్టి అది మళ్లీ దగ్గరపడే వరకు ఉడికించాలి.
-ఆ తర్వాత ఈ మిశ్రమంలో కమ్మని వాసన కోసం నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మీరు కుంకుమపువ్వు వాడుతున్నట్లయితే ఈ దశలోనే వేసుకోవాలి. మిశ్రమం పాన్ అంచులను వదిలేసి ముద్దలా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు ఒక ప్లేట్ లేదా ట్రే తీసుకుని దానికి నెయ్యి రాసి, ఉడికించిన బర్ఫీ మిశ్రమాన్ని అందులో వేయాలి. గరిటెతో సమానంగా, చదునుగా పరచాలి. దీని పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి, అవి బర్ఫీకి అంటుకునేలా గరిటెతో నెమ్మదిగా ఒత్తాలి.
-ఈ బర్ఫీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత చక్కగా సెట్ అవ్వడానికి 1-2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.
-చివరగా ఫ్రిజ్ నుంచి తీసి మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన మలై బర్ఫీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
