For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ కేన్ ఖీర్ రిసిపి: సంక్రాంతి స్పెషల్

|

భారతదేశంలో పొంగల్ ఫెస్టివల్ చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పండుగను మూడు లేదా నాలుగు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళీయులకు కూడా అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగ రోజున ప్రత్యేకంగా స్వీట్ పొంగల్ ను వండి ఇంట్లోని వారికి, బంధువులకు వడ్డిస్తారు. పొంగల్ అనేది సౌత్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకొనే ఒక పెద్ద పండుగ. నార్త్ ఇండియాలో ఈ పండుగను మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ పర్వదినానా ఒక వెరైటీ స్పెషల్ ఫుడ్ ను తయారుచేసుకుంటారు మరియు పొంగల్ చాలా సాధారణ రిసిపి.

పొంగల్ రిసిపిని స్వీట్ గా లేదా సావరీగా తయారుచేసుకోవచ్చు. కారం పొంగలి సెమీ లిక్విడ్ పొంగల్. సెమీ లిక్విడ్ పొంగల్ తయారుచేసుకొనేటప్పుడు అందులో షుగర్ కేన్ జ్యూస్ కలపడం వల్ల రుచి చాలా డిఫరెంట్ గా అద్భుతంగా ఉంటుంది. చెరకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతే కాదు, జాండిస్ తో బాధపడే వారికి షుగర్ కేజ్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది తాగడం వల్ల త్వరగా కోలుకుంటారు . షుగర్ కేన్ జ్యూస్ లో ప్రోటీన్స్, క్యాల్షియం, పొటాషియం మరియు ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటాయి.

ఇంకా ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . తరచూ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయి . మరి ఇన్ని బెనిఫిట్స్ ను షుగర్ కేన్ జ్యూస్ తో సంక్రాంతి పొంగల్ తయారుచేసుకోవడం వల్ల ఇటు సంప్రదాయ పద్దతిని ఫాలో అయినట్లు ఉంటుంది....ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొనేవారు అవుతారు. మరి షుగర్ కేజ్ జ్యూస్ తో పొంగల్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Sugarcane Kheer Recipe For Pongal

కావల్సిన పదార్థాలు:
షుగర్ కేన్ జ్యూస్(చెరకు రసం) - 1 cup
రైస్ - 1/2 cup
నెయ్యి - 2 teaspoons
పాలు - 1 cup
యాలకలు - 3 to 4
ఎండుద్రాక్ష - 2 teaspoons
జీడిపప్పు - 8 to 10 (chopped)
బాదం - 8 to 10 (sliced)

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అంుదలో పాలు మరియు రైస్ వేయాలి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి.

2. అన్నం మొత్తగా ఉడికిన తర్వాత అందులో షుగర్ కేన్ జ్యూస్ జోడించాలి. మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

3. తర్వాత ఇందులో నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి.

4. బియ్యం మెత్తగా ఉడికే వరకూ ఉడికిస్తూనే ఉండాలి . మెత్తగా ఉడికిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత...

5. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, యాలకలు, బాదం, మరియు జీడిపప్పును వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.

6. తర్వాత వీటిని తీసి ఉడుకుతున్న రైస్ పాన్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే షుగర్ కేన్ ఖీర్ రిసిపి రెడీ..

English summary

Sugarcane Kheer Recipe For Pongal

Sugarcane Kheer Recipe For Pongal,Today at Boldsky, we shall share a special sugarcane kheer recipe that you can prepare for Sankranti. Sugarcane has a lot of health benefits. People suffering from jaundice are usually adviced to consume sugarcare juice for a speedy recovery. Sugarcane is high in proteins, calcium, potassium and iron content.
Desktop Bottom Promotion