Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Gold Rates in India 100 grams Dropped RS 31,100 know 24k 22k 18k Yellow Metal prices on March 4 -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
Veteran Congress Leader KP Unnikrishnan Dies in Kozhikode: Remembering the Architect of Gulf Evacuation -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే..
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు
ఇడ్లీ, దోసెలోకి ఎప్పుడూ ఒకే రకమైన చట్నీ తిని విసుగొచ్చేసిందా?. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఆలోచిస్తున్నారా? వంకాయ అనగానే చాలామంది కేవలం కూరలు, ఫ్రైలు మాత్రమే చేసుకుంటారు. కానీ ఆ వంకాయతో నోరూరించే చట్నీ కూడా చేయొచ్చని మీకు తెలుసా?
వేడి వేడి ఇడ్లీ మీద కొద్దిగా నెయ్యి వేసుకుని లేదా కరకరలాడే దోసెతో ఈ వంకాయ చట్నీ నంజుకుని తింటే ఆ రుచే వేరు. ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే వంకాయ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
నూనె - 2 టీస్పూన్లు
వేరుశనగ గుళ్లు (పల్లీలు) - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 4
పచ్చి కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2
పెద్ద ఉల్లిపాయ - 1
టమాటాలు - 2
లేత వంకాయలు - 3
పసుపు - 2 చిటికెలు
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు - చిన్న ఉసిరికాయంత
కొత్తిమీర - కొద్దిగా
నీరు - తగినంత
తాలింపుకి నూనె - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - ఒక చిన్న కట్ట
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి పాన్ లేదా కడాయి పెట్టుకోండి. అందులో 2 టీస్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, వేరుశనగ గుళ్లు, మినప్పప్పు వేసి దోరగా వేయించండి. అవి కాస్త రంగు మారాక ఎండుమిర్చి, కొబ్బరి తురుము వేసి కమ్మటి వాసన వచ్చేలా వేయించి, పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో మరో 1 టీస్పూన్ నూనె వేసి వేడిచేయండి. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి పారదర్శకంగా (ట్రాన్స్పరెంట్) మారే వరకు వేయించండి.
-ఆ తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి మెత్తబడేదాకా ఉడికించండి. ఇప్పుడు మన అసలైన హీరో అయిన వంకాయ ముక్కలను వేయండి. కూరకు సరిపడా ఉప్పు, కాస్త పసుపు వేసి బాగా కలిపి మూతపెట్టండి. వంకాయలు నూనెలో మగ్గి, పూర్తిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి.
-వంకాయలు బాగా మగ్గిపోయాక, చిన్న చింతపండు ముక్క, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ కట్టేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, కొబ్బరి పొడిలో... చల్లారిన వంకాయ, టమాటా మిశ్రమాన్ని వేయండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా, కాస్త బరకగా ఉండేలా రుబ్బుకోండి. అప్పుడే చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-తాలింపు కోసం.. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి, నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడాక, తాజా కరివేపాకు వేసి వేయించండి. ఈ ఘుమఘుమలాడే పోపును తీసుకెళ్లి మనం గిన్నెలో పెట్టుకున్న వంకాయ చట్నీలో వేసి బాగా కలపండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












