Latest Updates
-
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
కురుక్షేత్ర యుద్ధం: మహాభారతంలోని కీలక ఘట్టాలు, అర్జునుడు, కర్ణుడి కథలు వెల్లడి -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు!
గుడిలో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగలి.. ఇంట్లోనే ఇలా చేస్తే మృదువుగా,మంచి రుచిగా
చక్కెర పొంగలి దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ఇది చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రసాదం దాదాపు అన్ని ఆలయాలలో పంపిణీ చేస్తారు. ఈ స్వీట్ దక్షిణ భారతదేశంలో ఉగాది, సంక్రాంతి, పొంగల్, నవరాత్రులు వంటి పండుగలు, శుభకార్యాలలో తయారు చేస్తారు. సాధారణ రోజుల్లో తినడానికి కూడా ఇది బాగుంటుంది. ప్రసాదం చక్కెర పొంగలి ఇంట్లోనే అదే టేస్ట్ తో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ప్రసాదం చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-బియ్యం
-బెల్లం
-నీళ్లు
-నెయ్యి
-చక్కెర
-జీడిపప్పు
-పచ్చ కర్పూరం
-కిస్మిస్
-ఎండుకొబ్బరి
-యాలకల పొడి
ప్రసాదం చక్కెర పొంగలి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో అరకప్పుపెసరపప్పు వేసి మీడియం మంట మీద లైట్ గా బంగారు రంగు వచ్చేదాకా బాగా ఫ్రై చేశాక ఓ గిన్నెలోకి తీసుకోండి.
-వేయించిన పెసరపప్పులో 1 కప్పు బియ్యం వేసి రెండూ కలిసేలా కలుపుకున్నాక శుభ్రంగా కడిగి అర గంట నీళ్లు పోసి నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నీరు ఒంపేసిన నానబెట్టిన బియ్యం,పెపరప్పు మిశ్రమం వేసి 4 కప్పుల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
-అది ఉడికేలోగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర కప్పుల పాత బెల్లం తురుము, అరకప్పు చక్కెర, 1కప్పు నీళ్లు పోసి బాగా కరిగించాలి. పాకం అక్కర్లేదు..జస్ట్ అది కరిగిపోయి మరగడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఉడికిన బియ్యం,పెసరపప్పు మిశ్రమాన్ని గరిటతో లైట్ గా మెదుపుకున్నాక ఇందులోనే కరగబెట్టిన బెల్లం నీళ్లను వడకట్టి పోయాలి. మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకొని దించేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి వేడయ్యాక అందులో 15 జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేశాక సన్నగా కట్ చేసిన ఎండుకొబ్బరి ముక్కలు, కొన్ని కిస్మిస్ వేసి బాగా ఫ్రై చెయ్యాలి.
-ఇప్పుడు నెయ్యితో సహా వేయించిన డ్రఫ్రూట్స్ అన్నీ పొంగలిలో వేసి కలుపుకోవాలి. అర టీస్పూన్ యాలకల పొడి, పెసరపప్పు సైజు అంత పచ్చి కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. అంతే రుచికరమైన చక్కెర పొంగలి రెడీ.
ఆయుర్వేదం ప్రకారం చక్కెర పొంగలి
ఆయుర్వేదంలో చక్కెర పొంగలిని సత్వగుణ ప్రధానమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇది పవిత్రమైన, శుభప్రదమైనది. ఆయుర్వేదం ప్రకారం, పాలు, బెల్లం, నెయ్యి కలయిక వల్ల శరీరానికి బలం, శక్తి లభిస్తుంది. ఈ పదార్థాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో అత్యంత ఉత్తమమైన ఆహారంగా పరిగణిస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









