Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పాతకాలం నాటి గట్టి గారెలు..క్రంచీగా భలే రుచి..నెల రోజులు నిల్వ ఉంటాయి..ఎలా చేసుకోవాలంటే
తెలుగువారికి ఇష్టమైన స్నాక్స్ లో గారెలు ఎప్పుడూ ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, పబ్బాలకు తప్పనిసరిగా చేసుకునే వంటకాల్లో మినప గారెలు ముందుంటాయి. ఇవి నెల రోజులకు పైగా నిల్వ ఉంటాయి. మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లకి, నడుము నొప్పులు ఉన్నోళ్లకు, కొంచెం వీక్ గా ఉన్నోళ్లకు, పిల్లలకు అందరికీ ఇది చాలా మేలుచేస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ గారెలను వివిధ రకాలుగా తయారు చేస్తారు. అందులో మినప గట్టి గారెలు ఒక ప్రత్యేకమైన రుచిని, సంప్రదాయ పద్ధతిని సూచిస్తాయి.
ఇవి బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండి నోరూరిస్తాయి. కేవలం రుచి మాత్రమే కాదు, మినపప్పులో ఉండే పోషకాలు ఈ గారెలను ఆరోగ్యానికి చాలా మంచివిగా మారుస్తాయి. మినప గట్టి గారెలు చేయడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే అవి మరింత రుచికరంగా, కరకరలాడుతూ వస్తాయి. మినప గట్టి గారెలు ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పొట్టుమినపప్పు
-పచ్చి శెనగపప్పు
-అల్లం
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-ఆయిల్
-జీలకర్ర
తయారీ విధానం
-ముందుగా 4 గిన్నెల పొట్టు మినపప్పు,1 గిన్నె పచ్చి శెనపప్పును శుభ్రంగా కడిగి విడివిడిగా కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత వడగిన్నెలోకి నానబెట్టిన మినపప్పు, శెనగపప్పును విడి విడిగా తీసుకొని నీళ్లు లేకుండా పోయాక కాటన్ క్లాత్ పై మినపప్పు, శెనగప్పును పలుచగా పరుచుకొని ఫ్యాన్ కింద అరగంటసేపు తడి ఆరనివ్వాలి.
-తర్వాత మినపప్పును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసి మెత్తగా చేయకూడదు. మినపప్పు చేత్తో పట్టుకొని వదిలేస్తే ముద్దలా వస్తే చాలు.
-పచ్చి శెనగపప్పును కూడా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-కారానికి తగినంత పచ్చిమిరపకాయలు,అల్లం,జీలకర్ర, కరివేపాకు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న మినపప్పు,పచ్చి శెనగపప్పు, పచ్చిమిర్చి మిశ్రమం మొత్తం ఓ పెద్ద గిన్నెలో వేసి మొత్తం అన్నీ కలిసేలా కలపాలి.
-ఇప్పుడు కాటన్ క్లాత్ పై పిండిని కొంచెం పెట్టి రౌండ్ గా అప్పాలుగా చేసుకొని వాటి మధ్యలో రంధ్రం పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ వేడి చేసి మంటను తగ్గించాలి.
-ఇప్పుడు ఆయిల్ లో వత్తుకున్న గారెలు వేసి మంచిగారెండువైపులా కాలనివ్వాలి. దీనికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది.
-మంచిగా కాలిన ఈ గారెలను ట్విష్యూ పేపర్ పెట్టి ఉన్న ప్లేట్ లోకి వేయండి..దీంతో వీటిల్లోని అదనపు నూనె టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









