Ragi Chimmili: ఎముకలను ఉక్కులా దృఢంగా చేసే రాగి చిమిలి..ఎలా చేసుకోవాలంటే

Posted By:

రాగితో తయారుచేసే ఏ వంటకాలు అయినా సరే టేస్ట్ అదిరిపోతుంది, ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. రాగి చిమిలి గురించి మీరెప్పుడనా విన్నారా? ఇది పాతకాలం నాటి రెసిపి. పెద్దలకు అయినా, పిల్లలకు అయినా ఎముకలు దృఢంగా అవ్వడానికి, రక్తం పట్టడానికి, బలహీనంగా ఉన్నోళ్లకి నీరసం పోయి బలంగా ఉండటానికి రాగి చిమిలి చాలా బాగా పనిచేస్తుంది. దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ ఇంట్లోనే ఈ టేస్టీ రాగి చిమిలి తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

రాగి చిమిలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగి పిండి
-పల్లీలు
-నెయ్యి
-నువ్వులు
-బెల్లం

రాగి చిమిలి తయారీ విధానం

-ముందుగా ఒక ప్లేట్ లో ఒక గ్లాసు రాగి పిండి వెయ్యాలి. అందులో చిటికెడు ఉప్పు, కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలా కలిపి దానిమీద ఓ గిన్నె బోర్లించి పావు గంట సేపు నాననివ్వాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ముప్పావు గ్లాసు పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.

-తర్వాత బాండీలోనే పావు గ్లాసు నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకోని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద నానిన రాగి పిండిని ఒక్కో ముద్దగా తీసుకొని అరటి ఆకు మీద పెట్టుకొని చపాతీలా వత్తుకొని పెనం మీద వేసి నెయ్యితో రెండువైపులా కాల్చుకొని పక్కనపెట్టుకొని చల్లారనివ్వాలి.

పాతకాలం నాటి బలవర్ధకమైన సజ్జ లడ్డూ..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

-తర్వాత వేయించిన పల్లీలను పొట్టు తీసేసి మిక్సీ గిన్నెలో వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. తర్వాత నువ్వులను కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

-తర్వాత చల్లారిన రాగి అట్లను ముక్కలుగా చేసి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముప్పావు గ్లాసు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసిన మిశ్రమాలన్నీ కలిపి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. అంతే రాగి చిమిలి రెడీ. దీనిని రోజుకొక్కటి తింటే చాలు ఆరోగ్యంగా ఉంటారు.

[ of 5 - Users]
Story first published: Tuesday, May 27, 2025, 13:58 [IST]
Desktop Bottom Promotion