Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఉడుపి స్టైల్ లో పూరీ కర్రీ..హోటల్ టేస్ట్ కన్నా అద్భుతంగా..జస్ట్ 10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
కర్ణాటక రాస్ట్రంలోని ఉడుపి ప్రాంత వంటకాలు తమ ప్రత్యేకమైన రుచికి, సుగంధభరిత మసాలా దినుసులకు, నూనె తక్కువగా వాడటానికి ప్రసిద్ధి చెందాయి. పూరీ కూర అనేది దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఉడుపి ప్రాంతంలో ఒక ప్రసిద్ధ అల్పాహారం. ఇది సాధారణంగా పూరీలతో పాటు వడ్డిస్తారు. ఇది సాంబార్, చట్నీల మాదిరిగా కాకుండా కూరగాయలతో తయారుచేసే పొడి కూర. ఇది చాలా రుచికరమైనది, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇది పూరీలోకే కాకుండా చపాతీలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వంటకానికి కావలసిన పదార్థాలు సాధారణంగా ఇళ్ళలో సులభంగా లభిస్తాయి. ఉడుపి స్టైల్ లో పూరీ కర్రీని కేవలం 10 నిమిషాల్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
ఉడుపి స్టైల్ పూరీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-శెనగపిండి
-బంగాళదుంప
-టమాటో
-ఉల్లిపాయ
-క్యారెట్
-పచ్చి బఠాణీ
-ఆవాలు
-పచ్చి శెనగపప్పు
-ఇంగువ
-ఆయిల్
-ఉప్పు
-కొత్తిమీర
-కరివేపాకు
-పచ్చిమిరపకాయ

ఉడుపి స్టైల్ పూరీ కర్రీ తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శెనగపిండి,కొద్దిగా నీళ్లు పోసి పిండిని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి 1 టీస్పూన్ ఆవాలు,అర టీస్పూస్ పచ్చి శెనగపప్పు, పావుటీస్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి.
-ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు,అర టీస్పూన్ పసుపు వేసి కలిపి 4 ఉల్లిపాయల సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
-ఉల్లిపాయ,క్యారెట్, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠాణీ వేగిన తర్వాత అందులో 1 టమాటో చిన్న ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటో మెత్తగా అయ్యేవరకు కలుపుకోవాలి.
-తర్వాత అందులో ముప్పావు గ్లాసు నీళ్లు పోసి కలుపుకొని నిమిషాలు మీడియం మంటమీద ఉడికించాలి.
-తర్వాత అందులో ఉడికించిన 1 పెద్ద బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం మంటమీద మరో 5 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత 1 నిమిషం పాటు బాగా కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న శెనగపిండి ఇందులో వేసి తక్కువ మంటమీద కలుపుతూ ఉడికించాలి.
-సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి 1 నిమిషం పాటు కలిపి దించేయండి. అంతే ఉడుపి స్టైల్ పూరీ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
